తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. ఈ లింక్‌తో డైరెక్ట్ రిజల్ట్స్! డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://tgdsc.aptonline.in/tgdsc/ లింక్ ద్వారా తమ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. By B Aravind 30 Sep 2024 | నవీకరించబడింది పై 30 Sep 2024 12:11 IST in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి డీఎస్సీ-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది మార్చి 1న 11,062 టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జులై 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరిగాయి. 2.45 లక్షల మంది అభ్యర్థులు ఈసారి పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల కోసం ఈ లింక్ https://tgdsc.aptonline.in/tgdsc/ లోకి వెళ్లండి. Also Read : కంగనా కొత్త కారు ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. ఏకంగా బంగ్లాను అమ్మేసి కొనుగోలు చేసిందిగా..! ప్రస్తుతం DSC జనరల్ ర్యాంకింగ్ జాబితాలు విడుదల చేయగా.. రేపు జిల్లాలకు జాబితా రానుంది. ఇక వచ్చే నెలలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరగనుంది. ఇప్పుడు విడుదల చేసిన ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటుంది. తర్వాత జిల్లాల వారిగా సెలెక్టడ్ లిస్టును డీఈవోలకు అందిస్తారని అధికారులు తెలిపారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారిగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. #telugu-news #dsc #telangana-dsc మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి