Hardik Pandya Craze In Wankhede Stadium : T20 వరల్డ్ కప్ 2024 లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తన ఆల్ రౌండ్ షోతో అదరగొట్టాడు. లాస్ట్ ఓవర్ లో బౌలింగ్ వేసి 7 పరుగుల తేడాతో గెలిపించిన పాండ్యా ఎంతో ఎమోషనల్ అయ్యాడు. భావోద్వేగంతో అతడు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కోట్లాదిమంది భారతీయులను కదిలించాయి.
రెండు నెలల క్రితం పాండ్యా వేరు.. ఇప్పుడు వరల్డ్ కప్‌తో తిరొగొచ్చిన పాండ్యా వేరు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అవమానాలు ఎదుర్కొన్న పాండ్యా.. ఇప్పుడు తనను గేలి చేసిన అభిమానులందరి మనుసు గెలుచుకున్నాడు. అందుకు ముంబైలోని వాంఖడే స్టేడియంలో మార్మోగుతున్న హార్దిక్ హార్దిక్ నినాదాలే అందుకు సాక్ష్యం. నిన్న రోడ్ షో ముగిసిన అనంతరం టీమ్ఇండియా వాంఖడే స్టేడియానికి చేరుకుంది.
2 months after he was massively booed by the fans, HARDIK HARDIK chants take over Wankhede 🔥🔥🔥
GREATEST REDEMPTION IN THE HISTORY OF CRICKET!!!!#T20WorldCup pic.twitter.com/BMDQgWTyfT
— Vinesh Prabhu (@vlp1994) July 4, 2024
దద్దరిల్లిన వాంఖడే…
అప్పటికే స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కొహ్లితో పాటు జట్టు సభ్యులందరూ డాన్స్ చేశారు. ఆ తర్వాత జాతీయ గీతాన్ని ఆలపించారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపైకి టీమ్ వెళ్లగానే స్టేడియం మొత్తం నినాదాలతో దద్దరిల్లిపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ వేదికపై పాండ్యా గురించి మాట్లాడుతున్న సమయంలో స్టేడియం మొత్తం హార్ధిక్, హార్ధిక్ అనే నినాదాలతో మారుమ్రోగిపోయింది.
India, you mean the world to me! From the bottom of my heart, thank you for all the love.. these are moments that I will never ever forget! Thank you for coming out to celebrate with us, despite the rains! We love you so much! Celebrating with you is why we do what we do! We’re… pic.twitter.com/c18lLrPJ1q
— hardik pandya (@hardikpandya7) July 4, 2024
దాంతో రోహిత్ తన స్పీచ్ ను కొన్ని నిమిషాల పాటూ ఆపి మరీ స్టేడియం వంక చూసాడు. అదే టైం లో హార్దిక్ స్మైల్ ఇస్తూ పైకి లేచి అందరికీ విక్టరీ సింబల్ చూపుతూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది.
Rohit Sharma said – “Hats off to Hardik Pandya bowled final over and he bowled brilliantly”.
– Then Wankhade crowds chanting “Hardik Hardik”.#IndianCricketTeam #RohitSharma𓃵 #hardikpandya #Mumbai #wankhede pic.twitter.com/Rg1croF0Wj
— Sanjeev Dherdu (@sanjeevdherdu) July 4, 2024