Delhi Police Viral Post : టీమిండియా (Team India) 17ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్ (T20 World Cup) గెలవడంతో దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. భారత్ జట్టు 11ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫి నెగ్గింది. 2013లో చివరిసారి ఛాంపియన్స్ ట్రోఫి గెలిచిన టీమిండియా మళ్లీ ఇన్నాళ్లు ఓ ఐసీసీ టోర్నమెంట్లో విజేతగా నిలిచింది. ఇక 2007లో ధోనీ సారధ్యంలో టీమిండియా మొదటి టీ20 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక 2011లో వన్డే వరల్డ్కప్ గెలిచింది. ఇక 2014 నుంచి జరిగిన ఐసీసీ (ICC) ఈవెంట్లలో సెమీస్ లేదా ఫైనల్లో ఓడిపోవడం టీమిండియాలకు అలవాటుగా మారిందని అనేక విమర్శలు ఉన్నాయి. అయితే టీ20 వరల్డ్కప్ 2024 గెలుపుతో ఈ విమర్శలకు బ్రేక్ పడిందనే చెప్పాలి. మరోవైపు భారత్ జట్టు విజయంపై సోషల్మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో ఆనందం వ్యక్తం చేస్తుండగా.. ఢిల్లీ పోలీసులు పెట్టిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..IND vs SA Final : ‘52,70,40,000 సెకండ్లు..’ మ్యాచ్ తర్వాత ఢిల్లీ పోలీసుల వైరల్ పోస్ట్..!
16ఏళ్లు 9 నెలల 5 రోజులు.. 52,70,40,000 సెకన్లు.. ఇండియా రెండోసారి టీ20 వరల్డ్కప్ గెలవడానికి ఇంత సమయం వేచి ఉన్నామని ఢిల్లీ పోలీసులు ట్వీట్ చేశారు. ఇంతే ఓపిగ్గా ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి ఉంటే ప్రాణాలు కాపాడుకుంటామని ఢిల్లీ పోలీసులు చేసిన ట్వీట్ వైరల్గా మారింది.
Translate this News: