Manchu Vishnu : వరల్డ్ కప్ విన్నింగ్ మూమెంట్.. ప్రభుదేవాతో మంచు విష్ణు సెలెబ్రేషన్స్, వీడియో వైరల్! T20 వరల్డ్ కప్ ఫైనల్స్ లో టీమిండియా విజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో మంచు విష్ణు ఈ మూమెంట్ ను తనదైన స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. By Anil Kumar 30 Jun 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Manchu Vishnu World Cup Winning Celebrations : T20 వరల్డ్ కప్ ఫైనల్స్ (T20 World Cup Finals) లో టీమిండియా (Team India) విజయం సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇండియా - సౌత్ ఆఫ్రికా మధ్య T20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఇండియా సౌత్ ఆఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయ ఢంకా మోగించి ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది. 17 ఏళ్ళ తర్వాత రెండో సారి వరల్డ్ కప్ గెలవడంతో యావత్ దేశం గర్విస్తోంది. ఈ సందర్భంగా సామాన్యుల నుంచి సినీ,రాజకీయ ప్రముఖుల దాకా భారత జట్టుపై ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ (Tollywood) హీరోలంతా సోషల్ మీడియా (Social Media) వేదికగా తమ అభినందనలు తెలుపగా.. హీరో మంచు విష్ణు ఈ మూమెంట్ ను తనదైన స్టైల్ లో సెలెబ్రేట్ చేసుకున్నాడు. అందుకు సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ఇక ఈ వీడియోలో మంచు విష్ణు, స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా పూనకంతో ఊగిపోయారు. చివరి ఓవర్లో హార్దిక్ బౌలింగ్ చేస్తుండగా.. వరల్డ్ కప్ మనదే అంటూ బిగ్గరగా కేకలు వేస్తూ సందడి చేశారు. Yahooooo! India! India! ❤️❤️❤️❤️ @ImRo45 🙏@imVkohli 🙏 What a memorable night @PDdancing anna ❤️❤️❤️ pic.twitter.com/k8q7WlmroL — Vishnu Manchu (@iVishnuManchu) June 29, 2024 Also Read : వరల్డ్ కప్ విన్నింగ్ పై టాలీవుడ్ తారల విషెస్.. వైరల్ అవుతున్న ట్వీట్స్! దీనికి సంబంధించిన వీడియోను మంచు విష్ణు (Manchu Vishnu) ట్విటర్‌లో పంచుకున్నారు. మ్యాచ్ ఓవర్ అంటూ విష్ణు సెలబ్రేట్ చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా మంచు విష్ణు ప్రస్తుతం 'కన్నప్ప' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. #t20-world-cup-2024 #manchu-vishnu #tollywood #t20-wolrd-cup-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి