Latest Update On Salman Khan’s Sikandar : బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan) నటింస్తున్న తాజా చిత్రం ‘సికందర్’. ఏప్రిల్‌లో ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ సికందర్ను ప్రకటించారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అమీర్‌ఖాన్ (Aamir Khan) హీరోగా నటించిన గజినీ ఫేమ్ ఏఆర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నేషనల్ క్రాష్ రష్మిక మందన (Rashmika Mandanna) ఈసినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సంబంధించి నిర్మాత ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
33,000 అడుగుల ఎత్తులో…
నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా ఈ సినిమా చిత్రీకరణ త్వరలో మొదలుకానుందని తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా.. “ఈ నెల 18న ‘సికందర్’ యాక్షన్ ప్రారంభం కానుంది. మొదటి రోజున అతిపెద్ద ఎయిర్ యాక్షన్ సీక్వెన్స్‌తో ఈ షూటింగ్‌ను ఆరంభించనున్నామని తెలుపడానికి చాలా ఉత్సాహంగా ఉంది” అంటూ రాసుకొచ్చారు.
ఇక ఈ మూవీ తొలి షెడ్యూల్లో భాగంగా సల్మాన్‌తో సముద్రమట్టానికి దాదాపు 33,000 అడుగుల ఎత్తులో అద్భుతమైన వైమానిక యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో ఈ సీక్వెన్స్ చాలా కీలకమని టాక్ వినిపిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది.