Sikandar Collections: సల్మాన్ ఖాన్ కి పైరసీ దెబ్బ.. తొలిరోజు ఎంత వసూలు చేసిందంటే

రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికందర్' విడుదలకు ముందే ఆన్లైన్లో పైరసీ కాపీ లీక్ అయింది. దీంతో సినిమా వసూళ్ల పై ప్రభావం చూపే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఫస్ట్ డే 'సికందర్' రూ.26కోట్లుతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.

New Update

Sikandar Collections:  ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో భారీ అంచనాలతో విడుదల సల్మాన్ ఖాన్  'సికందర్' ఊహించిన స్థాయిలో ఫ్యాన్స్ ని సంతోష పెట్టలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. తొలి రోజు మినిమమ్ రూ. 50 కోట్లు వసూలు చేస్తుందని భావించిన అంచనాలు తారుమారయ్యాయి. రూ. 26 కోట్లుతో డీసెంట్ ఓపెనింగ్స్ నమోదు చేసింది.  సల్మాన్ ఖాన్ గత సినిమా 'టైగర్ 3' తో పోలిస్తే తక్కువ ఓపెనింగ్స్ సాధించింది. 'టైగర్ 3' మొదటి రోజున రూ. 44.5 కోట్లు వసూలు చేసింది. అయితే ఈరోజు రంజాన్ సందర్భంగా కలెక్షన్లలో పెరుగుదల ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

పైరసీ ఎఫెక్ట్.. 

మరోవైపు  విడుదలకు ముందే సినిమా లీక్ అవడం కూడా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను ప్రభావితం చేస్తోందని  ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చెబుతున్నారు. దాదాపు  30-40% నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.  తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ వంటి పైరసీ సైట్లలో  'సికిందర్' లీక్ అయ్యింది. దీంతో వెంటనే చర్యలు తీసుకున్న నిర్మాతలు సినిమాను ఆన్ లైన్ నుంచి తొలగించాలని  సంబంధిత అధికారులను కోరారు.  సాజిద్ నడియాద్వాలా నిర్మించిన ఈ చిత్రంలో సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు కీలక పాత్రలు పోషించారు.  ప్రీతం సంగీతం అందించారు.

 latest-news | cinema-news sikandar-movie | Sikandar piracy 

Also Read:Janhvi Kapoor: సూట్ విప్పి.. ర్యాంప్ పై అదరగొట్టిన జాన్వీ.. నడుస్తుంటే మామూలుగా లేదుగా! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు