Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సికందర్'. అయితే ఈ సినిమాలో సల్మాన్ జోడిగా యంగ్ బ్యూటీ రష్మిక నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. వయసులో సల్మాన్ కంటే రష్మిక 31 ఏళ్ళు చిన్నది అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ''ఆమెకు లేని ఇబ్బంది.. మీకెందుకు'' అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఆమె కూతురుతోనూ నటిస్తా..
అయితే ట్రైలర్ లాంచ్ వేడుకలో రష్మిక- సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా, సల్మాన్ స్పందిస్తూ.. ''నాకు హీరోయిన్ కి 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్ళై.. పాప పుడితే ఆమె కూతురు కూడా బిగ్ స్టార్ అవుతుంది. అప్పుడు రష్మిక అనుమతి తీసుకొని ఆమెతోనూ నటిస్తాను'' అంటూ కౌంటర్ ఇచ్చారు. గజిని ఫేమ్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈమూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి
ఇదిలా ఉంటే.. 'సికిందర్' ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రేమ, వైలెన్స్, యాక్షన్, డ్రామా, న్యాయం కోసం పోరాడే తత్వం వంటి ఎమోషన్స్ తో సల్మాన్ పాత్ర ఆకట్టుకుంటోంది. సికిందర్ గా సల్మాన్ పాత్రను ఎంతో శక్తివంతంగా చూపించారు. అలాగే రష్మిక- సల్మాన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
cinema-news | sikandar-movie | salman-khan | rashmika
Salman Khan: రష్మికపై సల్మాన్ ఖాన్ షాకింగ్ కామెంట్స్-VIDEO
'సికందర్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రష్మిక, సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా.. సల్మాన్ చెప్పిన సమాధానం నెట్టింట వైరల్ గా మారింది.''నాకు రష్మికకు 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు?''అని కౌంటర్ ఇచ్చారు.
Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ 'సికందర్'. అయితే ఈ సినిమాలో సల్మాన్ జోడిగా యంగ్ బ్యూటీ రష్మిక నటించడంపై పలు విమర్శలు వచ్చాయి. వయసులో సల్మాన్ కంటే రష్మిక 31 ఏళ్ళు చిన్నది అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ జరిగింది. ఈ క్రమంలో తాజాగా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దీనిపై సల్మాన్ ఖాన్ స్పందించారు. ''ఆమెకు లేని ఇబ్బంది.. మీకెందుకు'' అంటూ ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఆమె కూతురుతోనూ నటిస్తా..
అయితే ట్రైలర్ లాంచ్ వేడుకలో రష్మిక- సల్మాన్ మధ్య ఏజ్ గ్యాప్ గురించి ప్రశ్నించగా, సల్మాన్ స్పందిస్తూ.. ''నాకు హీరోయిన్ కి 31 ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉందని కొందరు అంటున్నారు. హీరోయిన్ కి, ఆమె తండ్రికి లేని సమస్య మీకెందుకు? రష్మికకు పెళ్ళై.. పాప పుడితే ఆమె కూతురు కూడా బిగ్ స్టార్ అవుతుంది. అప్పుడు రష్మిక అనుమతి తీసుకొని ఆమెతోనూ నటిస్తాను'' అంటూ కౌంటర్ ఇచ్చారు. గజిని ఫేమ్ ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈమూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి
ఇదిలా ఉంటే.. 'సికిందర్' ట్రైలర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ప్రేమ, వైలెన్స్, యాక్షన్, డ్రామా, న్యాయం కోసం పోరాడే తత్వం వంటి ఎమోషన్స్ తో సల్మాన్ పాత్ర ఆకట్టుకుంటోంది. సికిందర్ గా సల్మాన్ పాత్రను ఎంతో శక్తివంతంగా చూపించారు. అలాగే రష్మిక- సల్మాన్ మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. సత్యరాజ్, ప్రతీక్ బబ్బర్, కిషోర్, శర్మన్ జోషి తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
cinema-news | sikandar-movie | salman-khan | rashmika
Also Read: HIT 3: నాని, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ డ్యూయెట్.. 'ప్రేమ వెల్లువ' సాంగ్ అదిరింది!