అవుడేటెడ్, బోరింగ్.. అసలేంటి ఈ సినిమా.. 'సికందర్' డైరెక్టర్ పై ఫ్యాన్స్ ట్రోలింగ్

ఈరోజు విడుదలైన సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సినిమా బాగుంది అంటుండగా.. మరొకొందరు బోరింగ్ కాన్సెప్ట్ అంటూ రివ్యూలు పెడుతున్నారు. గజినీ, తుపాకీ లాంటి సినిమాలు తీసిన మురుగదాస్ ఫుల్ డిస్సప్పాయింట్ చేశారని అంటున్నారు.

New Update

Sikandar Movie: ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో సల్మాన్ ఖాన్- రష్మిక మందన్న జంటగా నటించిన లేటెస్ట్ మూవీ  'సికందర్'. భారీ అంచనాలతో నేడు విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వస్తోంది. కొంతమంది సినిమా ఫుల్ ఎంటర్ టైనింగ్, ఎంగేజింగ్ అని చెబుతుండగా.. మరొకొందరు ఫ్యాన్స్ సినిమా చూసి ఫుల్ డిస్సప్పాయింట్ అయినట్లు రివ్యూలు పెడుతున్నారు. బోరింగ్ అండ్ అవుట్ డేటెడ్ ఫిల్మ్ డైరెక్టర్ మురుగదాస్ ని ట్రోల్ చేస్తున్నారు. ఒకప్పుడు తుపాకీ, కత్తి, రమణ లాంటి క్లాసిక్స్ అందించిన మురుగదాస్..  దశాబ్ద కాలంగా ఒక మంచి సినిమాని అందించలేక పోతున్నారంటే నమ్మలేకపోతున్నాము అని అంటున్నారు. 

నెటిజన్ల పోస్టులు 

తమ అభిమాన స్టార్ సినిమా చూడటానికి  200 nunchi 1000 రూపాయలు చెల్లిస్తున్న అభిమానులను ఇలాంటి D-గ్రేడ్ సినిమాలతో మోసం చేస్తున్నారు. అప్పుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ విత్.. ఇప్పుడు సల్మాన్ ఖాన్ సికందర్ విత్ మురుగదాస్  అంటూ పోస్టులు పెడుతున్నారు. 

థాంక్స్,.. సల్మాన్ ఖాన్ ఏ సినిమాలో కూడా ఇంతగా ఆసక్తి లేకుండా కనిపించలేదు. #సికందర్ లో అతని డైలాగ్ డెలివరీ ఫ్లాట్ గా ఉంది. అలాగే, సినిమాలో ఒక్క నటుడు కూడా మంచి నటనను ప్రదర్శించని అరుదైన చిత్రాలలో ఇది ఒకటి. దర్శకుడు #ARMurugadoss ఫామ్‌లో లేరు అంటూ మరో నెటిజన్ తన అభిప్రాయాన్ని చెప్పారు. 

ఒకప్పుడు తుపాకీ, కత్తి, రమణ లాంటి క్లాసిక్స్ అందించిన మురుగదాస్..  దశాబ్ద కాలంగా ఒక మంచి సినిమాని అందించలేక పోతున్నారంటే నమ్మలేకపోతున్నాము అని అంటున్నారు. 

బోరింగ్ అండ్ అవుట్ డేటెడ్ ఫిల్మ్ డైరెక్టర్ మురుగదాస్ ని ట్రోల్ చేస్తున్నారు.

మొదటి సన్నివేశం నుంచే రచన డల్ గా ఉంది.  పేలవమైన ప్రదర్శనలు.. సినిమాలో ఆసక్తిగా ఎదురుచూడటానికి ఏమీ లేదు. #సల్మాన్ ఖాన్ కూడా డిస్‌కనెక్ట్ అయినట్లు కనిపిస్తోంది. పూర్తిగా నిరాశ చెందాను అని మరో నెటిజన్ పోస్ట్ పెట్టాడు 

 cinema-news | latest-news | salman-khan-sikandar | sikandar-movie ar-murugadoss

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు