Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara) తన భర్త, డైరెక్టర్ భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) రియల్ క్యారెక్టర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. రీసెంట్ గా ఈ స్టార్ జోడీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. తన ప్రతి విజయంలోనూ విఘ్నేశ్ ఉంటాడంటూ నయన్ ప్రశంసలు కురిపించింది.
#Femi9Launch And the website is live 💥 https://t.co/0t9QrWagwD pic.twitter.com/ormrSVEdB2
— Nayanthara✨ (@NayantharaU) January 10, 2024
ఈ మేరకు నయన్ మాట్లాడుతూ.. ‘ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని అంటుంటారు. కానీ ప్రతి విజయవంతమైన, సంతోషంగా ఉన్న స్త్రీ వెనుక ఒక పురుషుడు కూడా ఉంటాడు. దానికి బెస్టె ఎగ్జాంపుల్ నేనే. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎన్నో సినిమాలకు పనిచేశాను. ఈ క్రమంలోనే విఘ్నేశ్ను కలిసిన నేను.. అప్పటినుంచి ఏ రోజు బాధపడలేదు. అన్ని రోజులు ఆనందంగానే ఉన్నాను. ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉంటూ ప్రోత్సాహిస్తాడే. నా నిర్ణయాలను ఎప్పుడూ ప్రశ్నించలేదు. నాకు ఎల్లప్పుడూ ధైర్యాన్నిస్తూ నడిపిస్తుంటాడు. నేను ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని కల్పించాడు’ అంటూ తెగ పొగిడేసింది నయన్. ప్రస్తుతం ఇందుకు సంబంధిచిన కాంమెట్స్ వైరల్ అవుతుండగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుతున్నారు.
Lets count on 💥 Happy New Year 2️⃣0️⃣2️⃣4️⃣🫶🏻 pic.twitter.com/21IeYF4MNz
— Nayanthara✨ (@NayantharaU) January 1, 2024
ఇదిలావుంటే.. నయనతార 75వ చిత్రంగా వచ్చిన ‘అన్నపూరణి’ వివాదంలో చిక్కుకుంది. చిత్ర నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ నుంచి దీనిని తొలగించేసింది. థియేటర్లలో మిశ్రమ స్పందనలు సొంతం చేసుకున్న మూవీ.. ఇటీవల నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. అయితే ఇందులోని కొన్ని సన్నివేశాలు మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ విశ్వహిందూ పరిషత్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రమేశ్ సోలంకి అనే వ్యక్తి నయనతారతో పాటు చిత్రబృందంపై కేసు పెట్టాడు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాణ సంస్థ ఓటీటీ స్ట్రీమింగ్ నుంచి తొలగించి.. మత విశ్వాసాలను దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదని వివరణ ఇచ్చింది. తమ సినిమా ఎవరినైనా ఇబ్బంది పెడితే క్షమించాలని కోరింది.
2023 blissful moments 😇 #WikkiNayanFamily pic.twitter.com/e9bpHU9zOt
— Nayanthara✨ (@NayantharaU) January 1, 2024
ఇక నయన్ ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాతో బిజీగా ఉంది. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘కుముధ’ అనే పాత్రలో నయనతార కనిపించనున్నారు.