రష్యా ఆర్మీలో 12 మంది ఇండియన్స్ మృతి, 16 మంది మిస్సింగ్
రష్యా కోసం పోరాడుతున్న ఆర్మీలో 126 మంది భారతీయులు పని చేసినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. వారిలో 12 మంది మరణించగా, 16 మంది తప్పిపోయారని MEA అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు. 96 మంది సైనికులు ఇండియాకు తిరిగి వచ్చారు.