GO Back Marwadi Controversy In Telangana | షాపులకు తాళాలు వెళ్లిపోతున్న మార్వాడీలు | Hyderabad | RTV
School Holidays: విద్యార్ధులకు పండగే.. నేడు ఆ జిల్లాల్లో విద్యా సంస్థలన్నీంటికి సెలవు.. కారణమిదే!
తెలంగాణలోని కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు బీభత్సంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో కామారెడ్డి, మెదక్, నిర్మల్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలు, స్కూళ్లు ఇలా అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది.
Punjab Floods: పంజాబ్ ను ముంచెత్తిన వర్షాలు.. మునిగిన స్కూల్..400 మంది పిల్లలు వరద నీటిలో..
పంజాబ్ లో విపరీతంగా కురిసిన వర్షాలకు గురుదాస్ పూర్ లో ఉన్న జవహర్ నవోదయ విద్యాలయం నీటిలో మునిగిపోయింది. అందులో ఉన్న 400 మంది పిల్లలు, స్కూలు సిబ్బంది వరద నీటిలో చిక్కుకుపోయారు.
J&K Tragedy: 35కు చేరుకున్న వైష్ణోదేవి యాత్ర మృతుల సంఖ్య..డేంజర్ గా జీలం నది
జమ్మూ, కాశ్మీర్ లో ఇంకా వర్షం కుండపోతగా కురుస్తూనే ఉంది. దీంతో జీలం నది ప్రవాహం ప్రమాద స్థాయిని చేరుకుంది. మరోవైపు వైష్ణోదేవి యాత్రలో కొండచరియలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య 35 కు చేరుకుంది.
Kamareddy: నీటమునిగిన కామారెడ్డి..రేపు పాఠశాలలకు సెలవు
కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలను భారీవర్షాలు కుదిపేస్తున్నాయి.
Weather Update: అల్పపీడనం ఎఫెక్ట్.. మరో రెండు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు.
Weather Update: ముంచుకొస్తున్న భారీ వర్షాలు.. మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వానలే వానలు
వాయవ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని వల్ల ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావం వల్ల మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.