Lizard in Biryani: హైదరాబాద్ చట్నీస్ రెస్టారెంట్ చట్నీలో వెంట్రుక సంఘటన మరువకముందే మరో దారుణం వెలుగుచూసింది. బిర్యానీలో ఏకంగా బల్లి రావడం ఫుడ్ ప్రియులను కవలరానికి గురిచేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్ అవుతోంది. ఈ సంఘటన ఏపీలోని గుంటూరు – అరండల్ పేటలో ఓ బిర్యానీ పాయింట్లో చోటుచేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి.
View this post on Instagram
ఈ మేరకు ఓ వ్యక్తి బిర్యానీ పార్సిల్ కట్టించుకొని ఇంటికి తీసుకువెళ్లాడు. అయితే ఇంటికి వెళ్లి పార్సిల్ విప్పి చూడగా బిర్యానీలో బల్లి ఉండటం చూసి షాక్ అయ్యాడు. వెంటనే వెళ్లి బిర్యానీ పాయింట్ నిర్వాహకులను అడిగితే దురుసుగా ప్రవర్తించినట్లు తెలిపాడు. తాను మాట్లాడుతుండగానే దుకాణాన్ని మూసి వెళ్లారని బాధితుడు వాపోయాడు. దీనిపై ఫుడ్ డిపార్ట్ మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. ఫుడ్ సెఫ్టీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: కాంగ్రెస్ నేతలపై జర్నలిస్ట్ రజత్ శర్మ పరువు నష్టం దావా