Suryapet: ఆంధ్రప్రదేశ్లో గరిడేపల్లి, మఠంపల్లి, హుజూర్నగర్, పాలకవీడు, చిలుకూరు, మేళ్లచేరువు పోలీసు స్టేషన్ ల పరిధిలో మోటార్లు దొంగతనం చేస్తున్న ముఠాను ఈరోజు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో గత కొంతకాలంగా మొటార్లు దొంగతనాలు చేస్తూ రైతులను ఇబ్బందులు పెడుతున్న వీరిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకోగలిగారు. మొత్తం 26 మోటారు దొంగతనాల కేసులకు సంబంధించిన నలుగురు దొంగలను అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దొంగలను పట్టుకున్న ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్, అదనపు ఎస్పీ నాగేశ్వరరావు, హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు, గరిడేపల్లి ఎస్సై సైదులు నరేష్, ఇతర సిబ్బంది దొంగల వివరాలను తెలిపారు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో రైతులు బావులపై, వాగులపై, చెరువు లపై, వ్యవసాయ నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న మోటార్లు , మోటార్ కోర్ లు (కాపర్ వైర్)లను దొంగలు దోచుకెళ్లారు. దీని మీద ఎప్పటి నుంచో కేసులు నమోదవుతూనే ఉన్నాయి. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.. ఈ రోజు గరిడేపల్లి పోలీసులు మండల పరిధిలో కల్మలచెరువు రోడ్డు లో పరెడ్డిగూడెం స్టేజి వద్ద వాహనాలు తనికి చేస్తుండగా ద్విచక్రవానంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు NTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు (A1), మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు (A2) అనుమానాస్పదంగా కనిపించారు. దాతో వారిద్దరినీ పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరి దగ్గరా కలిపి ఐదు లక్షలు నగదు దొరికింది. దీని మీద పోలీసులు ఆరా తీయగా మొత్తం వ్యవహారం అంతా బయటకు వచ్చింది. దాంతో పాటూ ఇందులో ఉన్న మొత్తం సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి 4.34 లక్షల విలువగల 31 మోటార్లు, 135 మోటార్ల నుండి దొంగిలించిన మోటార్ కోర్ (కాఫర్ వైర్) అమ్మగా వచ్చిన 10.01 లక్షల నగదు..ఒక ఆటో, 3 బైక్స్, సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రాలోNTR జిల్లాకు చెందిన ఉప్పతల వాసు (A1), మఠంపల్లి మండలానికి చెందిన వేముల కోటేశ్వర్ రావు (A2), అకారపు వెంకటి (A3), అజ్మీర మంత్రియ (A4) నలుగురు వ్యక్తులు జల్సాలకు అలవాటుపడి ఎలాగైనా డబ్బులు సంపాదించడం కోసం ఈ దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసు విచారణలో తేలింది. ఒక ఏడాదిగా గరిడేపల్లి, హుజూర్నగర్, మట్టంపల్లి, మేళ్లచెరువు, పాలకవీడు, చిలుకూర్ పోలీసు స్టేషన్ ల పరిధిలో వ్యవసాయ బావులు, వాగులపై, చెరువులపై రైతులు నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్ లను వీరు దొంగిలిస్తున్నారు. పగటి పూట రెక్కీ చేయడం…రాత్రిళ్ళు బైక్ లేదా ఆటో ట్రాలీల్లో వచ్చి మోటార్లను ఎత్తుకెళ్ళడం వీరి అలవాటు. ఆ తరువాత వాటిని తీసుకెళ్ళి మట్టంపల్లి గ్రామానికి చెందిన పాత ఇనుము వ్యాపారి గడగంట్ల శ్రీను కు అమ్మి డబ్బులు చేసుకునేవారు.