Kiran Kumar Reddy: మోదీ.. సామాన్య కుటుంబంలో పుట్టి అత్యున్నత స్థాయికి ఎదిగారని అన్నారు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. ఒక్క అవినీతి ఆరోపణ లేని వ్యక్తి.. మోదీ అని పేర్కొన్నారు. సీఎంగా, ప్రధానిగా మోదీ నిజాయతీగా పనిచేశారని కొనియాడారు. వంద దేశాలకు కరోనా వ్యాక్సిన్ పంపిన ఘనత మోదీదే అని అన్నారు. రాష్ట్రంలో ప్రజలను వేధించేలా జగన్ పాలన ఉందని ఫైర్ అయ్యారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు బీజేపీ కల్పించిందని అన్నారు. బీజేపీకి వచ్చే 375 సీట్లలో మన రాజంపేట కూడా ఉండాలని వ్యాఖ్యానించారు.
kiran kumar reddy
Midhun Reddy : కిరణ్ కుమార్ రెడ్డి.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే ఇలా చెయి..!
Press Meet : చిత్తూరు(Chittoor) జిల్లా పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కిరణ్ కుమార్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ‘కిరణ్ కుమార్ రెడ్డి(Kiran Kumar Reddy) నిన్ను సూటిగా అడుగుతున్న నువ్వు అమర్నాథ్ రెడ్డికె పుట్టవా.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే నువ్వు చెప్పిన కాణిపాకంలో నువ్వు ప్రమాణం చెయ్. ముఖ్యమంత్రిగా నువ్వు న్యాయంగా పనిచేశావని ప్రమాణం చెయి. అప్పుడు నేను ఎక్కడైనా ప్రమాణం చేసేకి సిద్ధం. నువ్వు ప్రమాణం చేయలేదు అంటే అమర్నాథ్ రెడ్డికి నువ్వు పుట్టలేదని అర్థం’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : కాంగ్రెస్‌లోకి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి సంచలన వ్యాఖ్యలు
AP: ఆ పదవికోసం నా కాళ్లు పట్టుకున్నాడు.. కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!
Kiran kumar: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి.. పెద్దిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికు మద్దతుగా కిరణ్ కుమార్ రెడ్డి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు DCC పదవికోసం పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి తన కాళ్ళు పట్టుకున్నాడని చెప్పారు. అంతేకాదు మళ్ళీ తెల్లవారి వచ్చి రెండవ సారి కాళ్ళు పట్టుకొని నాకు DCC పదవీ ఇవ్వండని వేడుకున్నట్లు గుర్తు చేశారు.
ప్రమాణం చేయడానికి సిద్ధం..
ఆయన నా కాళ్ళు పట్టుకున్నట్లు నేను ఏదేవుడి దగ్గరైన ప్రమాణం చేయడానికి సిద్ధం. నువ్వు సిద్ధమా పెద్దిరెడ్డి? అంటూ కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్పారని అన్నారు. మంత్రి పదవితో జిల్లాలో ఇసుక, మైనింగ్, మట్టి, నాసి రకం మద్యం లాంటి అక్రమ సంపాదనకు ఆశపడి ప్రజలరక్తం తాగుతున్నాడు. ముఖ్యమంత్రి అవుతే ఎలా ఉంటుందో ఒక్క సారి ఆలోచించండి అన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: కాలేజీ క్యాంపస్‌లో కార్పొరేటర్ కూతురు హత్య!
అన్నీ కక్కిస్తాం..
అలాగే కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరు పరిసరాల్లో నాలుగు వందల కోట్ల రూపాయల భూములుఅన్యాక్రాంతం ఆయినట్లు తెలిపారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అన్నీ కక్కిస్తామని అన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టిన ఎవ్వరికీ వదిలే పరిస్థితి లేదని అన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని తమకుటుంబ సభ్యులతో ఎమ్మెల్లే అభ్యర్థి గా నామినేషన్ దాఖలు చేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫర్మాన్ అహ్మద్ ఖాన్ గారికి పత్రాలు అందించారు. నామినేషన్ వేయడానికి సహకరించిన టీడీపీ, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, మహిళలు, నల్లారి అభిమానులకు కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
AP Politics : పుంగనూరులో కిరణ్ కుమార్ రెడ్డి Vs పెద్దిరెడ్డి.. మాటల తూటలు!
Tirupati : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి కుటుంభంపై రాజంపేట(Rajampet) బీజేపీ(BJP) ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి(Nallari Kiran Kumar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగిన బీజేపీ జనసేన(Janasena) టీడీపీ(TDP) ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రాజెక్టుల పేరుతో ఎలాంటి అనుమతులు లేకుండా రెండు వేల రెండు వందల కోట్లు కాంట్రాక్ట్ తీసుకున్న ఘనత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దని దుయ్యబట్టారు.
Also Read: పేర్ని నాని బీ కేర్ ఫుల్.. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి వార్నింగ్..!
ప్రభుత్వం మారిపోతుందని ఎలాంటి అనుమతులు లేకున్న పనులు మొదలు పెట్టారని విమర్శలు గుప్పించారు. రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం దోపిడీకి, అరాచకానికి, దౌర్జన్యాలకు అక్రమ కేసులకు ఇలాగే నలుగుతారా? అని ప్రశ్నించారు. రానున్న 45 రోజుల్లో మీకు విముక్తి కావాలా, బానిసత్వం కావాలా మీరే నిర్ణయించుకోవాలని సమావేశంలో వ్యాఖ్యానించారు. వారి అక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలని పిలుపునిచ్చారు.
Also Read: జగన్ బీజేపీకి ఓ బానిస.. అన్నను ఓడిస్తేనే అభివృద్ధి: షర్మిల సంచలనం
అయితే, ఈ వ్యాఖ్యలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddi Reddy Rama Chandra Reddy) స్పందించారు. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఒడించామని, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఒడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్ ను కిరణ్ కుమార్ రెడ్డి వేధించారని విమర్శలు గుప్పించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని మండిపడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారన్నారు.
BJP Morcha Meeting Kishan Reddy: బీజేపీ మోర్చాల అధ్యక్షులతో కిషన్‌రెడ్డి భేటీ, కిరణ్ కుమార్ రెడ్డి రాకతో..
ఇప్పటికైనా మమ్మల్ని గుర్తించినందుకు చాలా కృతజ్ఞతలు అంటూ మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు వారి వారి అభిప్రాయాలను కిషన్‌రెడ్డికి తెలిపారు. మాకు ఏ పని అప్పగించినా సరే.. దానిని పూర్తి చేసేందుకు అన్నివేళలా మేం సిద్ధంగా ఉన్నామంటూ వారు పేర్కొన్నారు. అయితే.. ఎమ్మెల్సీ కవిత విషయంలో చర్యలు తీసుకోకపోవడంపై ప్రజల్లో చర్చ జరుగుతుందని తెలిపారు. బీజేపీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తే బాగుంటుందని బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు కిషన్‌రెడ్డి ముందు వెల్లడించారు.
మేమందరం పార్టీతోనే..
బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షులు చెప్పిన దానికి సునీల్ బన్సల్, ప్రకాష్ జవదేకర్ ఇలా స్పందిస్తూ.. ఇకపై మేము మేమందరం అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకునే వారు నియోజకవర్గాల్లో పనిచేసుకోండి.. ప్రజాసమస్యలపై(Public Issue) పోరాటం చేయండి.. మీరు ఏది చెప్పాలనుకున్న మాకు చెప్పండి.. లేదా కిషన్ రెడ్డి అందుబాటులో లేని సమయంలో ఇంద్రసేనారెడ్డిని(Indra sena reddy) కలువొచ్చని ప్రకాశ్ జవదేకర్, సునీల్ బన్సల్ తెలిపారు.
బీజేపీ శ్రేణులు వ్యూహం
దీంతో.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారం దక్కించుకునేలా బీజేపీ శ్రేణులు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అనుసరించాల్సిన 100 రోజుల (100 Days) కార్యచరణపై కమలం పార్టీ (BJP)నేతలు ఇప్పటికే కసరత్తును ప్రారంభించారు. అంతేకాకుండా బీఆర్ఎస్(BRS)ను ఎదుర్కొనేందుకు రాబోయే తెలంగాణ ఎన్నికల (Telangana Elections)నేపథ్యంలో రాజకీయ కార్యాచరణను(Political Activity)రూపొందించేందుకు అందరం కలిసికట్టుగా పని చేసేలా ప్రణాళికలు రూపొందించాలని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడించారు.
తెలంగాణ బీజేపీకి కొత్త టెన్షన్
ఇదిలా ఉంటే.. తెలంగాణ బీజేపీకి మరో కొత్త టెన్షన్(Tension)కలవరపెడుతోంది. బీజేపీ నేతల సమావేశాలకు ఏపీ నేతలు (Ap Leaders)రావడంతో తెలంగాణ నేతలు (Telangana Leaders) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy)రాకను బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanthi)వ్యతిరేకించారు. కిరణ్ కుమార్ మాకొద్దు అని రాష్ట్ర బీజేపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఇక, కిరణ్‌కుమార్‌రెడ్డిని స్థానిక నేతలు మరో చంద్రబాబు(Chandrababu)లాగా భావిస్తున్నారు.