Kanguva Movie : తమిళ సినిమా ఇండస్ట్రీలో హైప్‌ను రేకెత్తిస్తున్న సినిమాల్లో ‘కంగువా’ ఒకటి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రాబోతుంది. మొదటి భాగం దసరా కానుకగా అక్టోబర్ 10 న రిలీజ్ కాబోతుంది. అదే ఇదే తేదీన మరికొన్ని చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ పోటీపై నిర్మాత కేఈ జ్ఞానవేల్ మాట్లాడుతూ.. ” కంగువ కంటెంట్ గురించి తెలియదు కాబట్టి.. దీని మొదటి భాగం వచ్చే తేదీకి మరికొన్ని సినిమాలు విడుదలయ్యే అవకాశం ఉంది. కానీ, ‘కంగువ2’తో మాత్రం ఎవ్వరూ పోటీకి రాలేరు. ఈ విషయాన్ని నమ్మకంతో చెబుతున్నాను. సినిమా కంటెంట్ అంత బలమైనది” అని చెప్పారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
హాలీవుడ్ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాను తమిళ మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తున్నారు. సూర్య కొత్త లుక్‌లో కనిపించడంతో పాటు, ఆయన యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను అలరించనున్నాయి. దర్శకుడు శివ ఇంతకు ముందు చేసిన చిత్రాలు ప్రేక్షకులను అలరించడంతో, ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. దసరా కానుకగా విడుదలవుతుండడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.