భారీ ధరకు 'కంగువా' డిజిటల్ రైట్స్.. స్ట్రీమింగ్ ఆ ఓటీటీలోనే, ఎప్పుడంటే?

'కంగువా' ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. థియేటర్ రిలీజ్ తర్వాత 6 వారాలకు స్ట్రీమ్ అయ్యేలా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 25 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది.

New Update
dgdsg

కోలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కిన 'కంగువా' నేడు (నవంబర్ 14) ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో రిలీజ్ అయింది. సూర్య హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ చిత్రానికి ఆడియన్స్ నుంచి మిక్స్ డ్ రెస్పాన్స్ వచ్చింది. సూర్య పెర్ఫార్మెన్స్ తప్ప సినిమాలో చూడదగ్గ అంశాలేవీ లేవని, డైరెక్టర్ కథను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడని సినిమా చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. 

ఇదిలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్ మాత్రం భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. సుమారు రూ. 350 కోట్ల భారీ బ‌డ్జెట్‌ తో తెరకెక్కిన 'కంగువా'  ఓటీటీ రైట్స్ కోసం ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్ మాత్రం కాస్త ఆలస్యంగా ఉండబోతుందట.

Also Read : 'పుష్ప 2' కోసం రంగంలోకి రాజమౌళి.. సుకుమార్ ప్లాన్ అదుర్స్

అమెజాన్ ప్రైమ్ లో..

మాములుగా తమిళ సినిమాలు థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తుంటాయి. కానీ, 'కంగువ' మాత్రం మరో రెండు వారాలు ఆలస్యంగా.. అంటే 6 వారాలకు స్ట్రీమ్ అయ్యేలా డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. దాని ప్రకారం ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. 

ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించారు. సూర్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని కథానాయికగా నటించింది. బాబీ డియోల్ విలన్ రోల్ చేశారు. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.

Also Read : తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు..హైకోర్ట్ కీలక నిర్ణయం, నటి కస్తూరి అరెస్ట్?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు