Team India: చైనాలోని మోకి ట్రైనింగ్ బేస్ లోని హులున్‌బుయిర్‌లో జరిగిన ఫైనల్లో హర్మన్‌ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత జట్టు 1-0తో ఆతిథ్య జట్టు చైనాను ఓడించి…టైటిల్‌ను సొంతం చేసుకుంది. దీంతో భారత్ ఐదోసారి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నీ ఆరంభం నుంచే టీమ్ ఇండియా పురుషుల జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది.క్వార్టర్స్‌లో పాకిస్తాన్ జట్టును ఓడించి సెమీ ఫైనల్‌కు దూసుకెళ్ళింది. అక్కడ కొరియా జట్టును 3–1 తేడాతో ఓడించి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇక ఈరోజు జరిగిన టఫ్ మ్యాచ్‌లో 1–0 గోల్స్‌తో చైనా జట్టును డిఫీట్ చేసింది భారత టీమ్.
ఈరోఉ జరిగిన ఫైనల్యా మ్యాచ్ మొదటి నుంచీ ఉత్కంఠ భరితంగా సాగింది. రెండు టీమ్‌లూ చాలా పట్టుదలగాగల్స్ కొట్టనివ్వకుండా ఆడాయి. అయితే చివర్లో పెనాల్టీ కార్నర్లో భారత ఆటగాళ్ళు గోల్ కొట్టడంతో మ్యాచ్ టీమ్ ఇండియా వశం అయింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్ ముందు ఉన్న మరో డిఫెండర్ జుగ్‌రాజ్‌కి అద్భుతమైన బంతిని అందించాడు మరియు జుగ్రాజ్ తన స్ట్రైక్‌ను చైనీస్ గోల్-సేవర్‌ను దాటించాడు.
Also Read: JIO: ఒక్కసారిగా జియో డౌన్..సోషల్ మీడియాలో గగ్గోలు