Hockey: మరీ ఇంత దారుణమా! క్రికెటర్లకేమో కోట్లకు కోట్లు.. హాకీ ఆటగాళ్లకు చిల్లర పైసలా?
క్రికెట్ వర్సెస్ హాకీ ఫ్రైజ్ మనీ లెక్కలపై సోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటివలే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేసియాపై భారత్ జట్టు గెలిచింది. ఈ గేమ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఆటగాడికి ఇచ్చింది 17వేల రూపాయలేనట. అదే క్రికెట్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌కి లక్షలు ఇస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అలాగే ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ విజేతకు 48లక్షల రూపాయల ఫ్రైజ్ మనీ ఉండగా.. క్రికెట్లో ఆసియా కప్ కొడితే రెండు కోట్లు ఇస్తారు.