Sports: మొక్కవోని ఆత్మవిశ్వాసమే బలంగా అడుగు..సుఖ్‌జీత్ సింగ్ బలం అంటే శారీరక దృఢత్వం ఒక్కటే కాదు, మానసిక బలం కూడా! ఎవరు సంకల్పంతో కాల పరిధుల్ని, అవధుల్ని అధిగమించగలరో వారే విజేతలు.ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ సుఖ్‌జీత్ సింగ్. పక్షవాతం బారినా పడినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసాడు. అతని కథేంటో మీరూ చదివేయండి. By Manogna alamuru 21 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hocky Player Sukhjeet Singh : త్వరలో ప్రారంభంకానున్న 2024 ప్యారిస్ ఒలింపిక్స్ (Paris Olympics) లో టీమిండియా (Team India) జట్టులో స్థానం దక్కించుకున్న హాకీ ఫార్వర్డ్ ప్లేయర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు స్పోర్ట్స్ లవర్స్. ఇతనిని అందరూ ఉదాహరణగా తీసుకోవాలని చెబుతున్నారు. పంజాబ్ (Punjab) లోని జలంధర్‌లో 1996లో పుట్టిన సుఖ్‌జీత్ సింగ్ పోలీస్ టీమ్ తరఫున హాకీ ఆడే తండ్రిని చూసి చిన్ననాటి నుంచే ఈ ఆట గురించి తెలుసుకున్నాడు. ఈ ఆటపై మక్కువ పెంచుకున్నాడు. ఆరో ఏటనే హాకీ స్టిక్ చేతబట్టి ఓనమాలు నేర్చాడు. నాటి నుంచి తండ్రి ప్రోత్సాహంతో భారత జట్టులో చోటే లక్ష్యంగా శ్రమించాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ లక్ష్యానికి చేరువగా వచ్చాడు. కానీ.. తానొకటి తలిస్తే దైవమొకటి తలిచినట్లు పక్షవాతం రూపంలో ప్రమాదం ముంచుకొచ్చింది. ఆరేళ్ల క్రితం వెన్నునొప్పి బారిన పడిన సుఖ్‌జీత్.. కుడికాలు తాత్కాలిక పక్షవాతానికి గురైంది. దీంతో అతడి కలలు కల్లగానే మిగిలిపోతాయేమోనని కుటుంబం భయపడింది. అయితే, తండ్రి ప్రోత్సాహం, తన సంకల్ప బలం వల్ల సుఖ్‌జీత్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. భారత జట్టు తరఫున అరంగేట్రం చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పటి వరకు 70 మ్యాచ్‌లు ఆడి.. 20 గోల్స్ స్కోరు చేశాడు. గతేడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన జట్టులోనూ సుఖ్‌జీత్ ఉన్నాడు. మైదానంలో పాదరసంలా కదులుతూ అద్భుతమైన పాస్‌లు మూవ్ చేసే సుఖ్‌జీత్‌కు ఒలింపిక్స్ ఆడే టీమిండయా జట్టులోనూ చోటు సంపాదించుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం! Also Read:Health: మన మీద మనకే డౌటు పుట్టించే జబ్బు..బాడీ డిస్‌మార్ఫియా #paris-olympics #sukhjeet-singh #hockey మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి