AP Elections 2024 : సినీ నటుడు జనసేన(Janasena) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి MLA గా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పవన్ ఏపీలో ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. పవన్ కి సపోర్ట్ గా మెగా ఫ్యామిలీ హీరోలతో పాటూ సినీ పరిశ్రమకు చెందిన పలువురు జనసేనకు మద్దతు తెలుపుతున్నారు.
మే 13 న జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుస్తారని ఫ్యాన్స్ సైతం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పవన్ కళ్యాణ్ అంటే పడి చచ్చిపోయే ఓ హీరోయిన్ పవన్ గెలిస్తే ఏకంగా గుండు కొట్టించుకుంటానని మొక్కుకుందట.
Also Read : కష్టాల్లో ‘భీమ్లా నాయక్’ సింగర్.. ఆర్థిక సాయం అందిచిన సీరియల్ నటి!
పవన్ గెలిస్తే గుండు కొట్టించుకుంటా – హీరోయిన్
పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టపడే ఓ హీరోయిన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుందట. ఈసారి జరగబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం(Pithapuram) నుంచి భారీ మెజారిటీతో గెలిస్తే గుండు కొట్టించుకుంటానని తన ఇష్ట దైవానికి మొక్కుకుందట.
ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా అంతటా ట్రెండ్ అవుతుండటంతో పవన్ ఈసారి విజయం సాధించడం పక్కా అని, గుండు కొట్టించుకోడానికి ఆ హీరోయిన్(Heroine) సిద్ధంగా ఉండాలంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే విషయం తెలియక పోయినా.. పవన్ కళ్యాణ్ కోసం గుండు కొట్టించుకునేందుకు రెడీ అయిందంటే ఆమె పవన్ కి డైహార్ట్ ఫ్యాన్ కావచ్చని నెటిజన్స్ అంటున్నారు.