Court Movie: టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని సమర్పణలో తెరకెక్కనున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘కోర్ట్’. రామ్ జగదీష్ దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించనున్న ఈ చిత్రాన్ని నేడు పూజ కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, ప్రియదర్శి, సీనియర్ నటుడు సాయి కుమార్, శివాజీ, నిర్మాత ప్రశాంతి పాల్గొన్నారు. సినిమాకు నాని క్లాప్ కొట్టగా.. నిర్మాత ప్రశాంతి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ చిత్రంలో సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించనున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరాఠి బ్లాక్ బస్టర్ హిట్ ‘కోర్ట్’ మూవీకి రీమేక్ ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. వాల్ పోస్టర్ బ్యానర్ పై ప్రశాంతి త్రిపిరినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓ యువకుడిని అన్యాయంగా కేసులో నిందితుడిగా చేసిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రం ఉండబోతున్నట్లు సమాచారం.
#COURT begins with an auspicious puja ceremony. Shoot begins this September ✨
Natural Star @NameisNani Presents#COURT – ‘State vs A Nobody’ ⚖️
Motion Poster Out now!
▶️ https://t.co/iQzOOA6nhHStarring @PriyadarshiPN
Directed by #RamJagadeesh@ActorSivaji @saikumaractor… pic.twitter.com/4K4Pbqb97E
— BA Raju’s Team (@baraju_SuperHit) August 30, 2024
పూజ సెర్మనీ ఫొటోస్
Also Read: Ravi Shankar: ‘మిస్టరీ వీడబోతుంది’… నటుడు రవిశంకర్ కొత్త సినిమా అప్డేట్! – Rtvlive.com