Saripodhaa Sanivaaram: నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ అప్ కమింగ్ ఫిల్మ్ ‘సరిపోదా శనివారం ‘. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్, టీజర్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచగా.. తాజాగా ఫ్యాన్స్ కు మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Saripodhaa Sanivaaram: నాని ‘సరిపోదా శనివారం’ నుంచి అదిరిపోయే అప్డేట్
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'సరిపోదా శనివారం'. తాజాగా మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సరిపోదా శనివారం ఫస్ట్ సింగిల్ 'గరమ్ గరమ్' సాంగ్ జూన్15 న విడుదల చేయనున్నట్లు తెలిపారు.
Translate this News: