Producer Dil Raju : సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. పొలిటికల్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీని అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.
అయితే మళ్లీ ఈ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందని, 2025లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని గత కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంపై నిర్మాత దిల్‌రాజు తాజాగా క్లారిటీ ఇచ్చారు.’ గేమ్ ఛేంజర్ రిలీజ్ వాయిదా అని వస్తున్న వార్తలు ఫేక్. అవి నమ్మకండి. ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా తీసుకురాబోతున్నాం.
Also Read : రెండోసారి తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. సీమంతం ఫొటోలు వైరల్
ఈ మూవీతో రామ్ చరణ్‌తో పాటు, శంకర్ల ఇమేజ్ మారిపోతుంది. మూవీ బిగ్ సక్సెస్ అవ్వబోతుంది. పొలిటికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా అభిమానులకు ఒక ఫీస్ట్ లాంటిది’ అంటూ తెలిపారు. దిల్ రాజు ఇచ్చిన క్లారిటీతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.