/rtv/media/media_files/4iD6wx7D9OQj3eCQCYeM.jpg)
టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వచ్చే సంక్రాంతికి గట్టి పోటీనే ఉండబోతుంది. ప్రతీ ఏటా పొంగల్ బరిలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినట్లే.. ఈసారి అదే రిపీట్ కాబోతుంది. అందరికంటే ముందు సంక్రాంతి బరిలో మెగాస్టార్ ఉండాల్సింది. ఆయన నటిస్తున్న 'విశ్వంభర' మూవీ జనవరి 10 న రిలీజ్ చేస్తున్నట్లు ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ చిరు మాత్రం తన కొడుకు రామ్ చరణ్ కోసం ఆ డేట్ ను త్యాగం చేశారు.
Also Read : ఓటీటీలోకి 'దేవర' రాక.. అప్పుడేనా?
దాంతో ఈసారి చరణ్ 'గేమ్ ఛేంజర్' తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇప్పుడు చరణ్ కు పోటీగా మరో హీరో దిగుతున్నాడు. అతను మరెవరో కాదు మన అక్కినేని నాగ చైతన్య. 'గేమ్ ఛేంజర్' రిలీజ్ రోజునే చైతూ నటిస్తోన్న 'తండేల్' సైతం విడుదల కాబోతున్నట్లు లేటెస్ట్ టాక్ బయటికొచ్చింది. 'తండేల్' మూవీ నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది.
#Thandel jan 9 🔏 2025@GeethaArts @ThandelTheMovie @chandoomondeti pic.twitter.com/1l7tvCHayy
— #Akhil6 (@shaikrafiq86) October 15, 2024
Also Read : 'దేవర' సక్సెస్ పై ఎన్టీఆర్ ఎమోషనల్.. వైరలవుతున్న పోస్ట్
చందూ మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీతోనే నాగ చైతన్య పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. రియల్ స్టోరీ కావడంతో సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లోనూ భారీ హైప్ నెలకొంది. నిజానికి ఈ సినిమాను మొదట డిసెంబర్ 20 న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఏమైందో తెలీదు.. ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ వార్త ఫిలిం నగర్ లో హల్చల్ చేస్తోంది.
Sankranthi fight between @chay_akkineni vs @AlwaysRamCharan
— 𝗗𝗥𝗔𝗚𝗢𝗡 𝗪𝗔𝗥 🐉 (@Dragonwarbegins) October 15, 2024
Who will Win The Clash , Go for your Honest option?
RT for GC. Like For #Thandel pic.twitter.com/MvwXqoBrsw
Also Read : RGV డెన్ లో 'యానిమల్' డైరెక్టర్.. ఏం ప్లాన్ చేస్తున్నారో?
మెగా - అక్కినేని వార్..
సంక్రాంతి బరిలో 'గేమ్ ఛేంజర్' లాంటి భారీ బడ్జెట్ మూవీ ఉన్నా కూడా కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే 'తండేల్' మూవీ టీమ్ వెనక్కి తగ్గడం లేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాకపోయినా.. వచ్చే సంక్రాంతికి 'తండేల్' రిలీజ్ ఫిక్స్ అయిందని నెట్టింట స్ట్రాంగ్ బజ్ వినిపిస్తోంది. మరి ఇదే కనుక నిజమైతే మెగా- అక్కినేని హీరోల మధ్య బాక్సాఫీస్ వార్ ఓ రేంజ్ లో ఉండబోతుందని చెప్పొచ్చు.