ఫ్యాన్స్ కు బిగ్ షాక్ .. దేశం కానీ దేశంలో 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్

'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలో నిర్వహించబోతున్నారు. యు.ఎస్‌.ఎ. (కర్టిస్‌ కల్‌వెల్‌ సెంటర్‌, 4999 నామన్‌ ఫారెస్ట్‌, టెక్సాస్‌)లో డిసెంబరు 21 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 

New Update
game changer22

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ 'గేమ్ ఛేంజర్' కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తున్నారు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సంక్రాంతి కానుకగా జనవరి 10 న ఈ మూవీ వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రిలీజ్ టైం దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. 

యూ ఎస్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న తరుణంలో మేకర్స్ భారీ షాక్ ఇచ్చారు. 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏకంగా అమెరికాలో నిర్వహించబోతున్నారు.  యు.ఎస్‌.ఎ. (కర్టిస్‌ కల్‌వెల్‌ సెంటర్‌, 4999 నామన్‌ ఫారెస్ట్‌, టెక్సాస్‌)లో డిసెంబరు 21 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నట్టు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. 

Also Read: Iran: విమానాల మీద నుంచి ఇరాన్ క్షిపణులు–చూసిన పైలట్లు, ప్రయాణికులు

ఇప్పటి వరకు ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో ప్లాన్ చేయడం ఇదే తొలిసారి. దీంతో విదేశంలో ముందస్తు విడుదల వేడుక జరుపుకోనున్న తొలి భారతీయ చిత్రంగా ‘గేమ్‌ ఛేంజర్‌’ నిలవనుంది. తెలుగు సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు రావడంతో ఇప్పటికే కొన్ని సినిమాలు విదేశాల్లో పలు ఈవెంట్స్ నిర్వహించాయి. 

ఇప్పుడు 'గేమ్ ఛేంజర్' టీమ్ మరో అడుగు ముందుకేసి ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నే ప్లాన్ చేసింది. అయితే ఇది కాస్త మెగా ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈవెంట్ ఉంటుందని, తమ అభిమాన హీరోను లైవ్ లో చూడొచ్చని మెగా ఫ్యాన్స్ అంతా ఆశ పడ్డారు. కానీ వాళ్ళ ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లారు. 

Also Read: రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గేకు షాక్.. రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసులు 

Advertisment
Advertisment
తాజా కథనాలు