Faria Abdullah: యంగ్ బ్యూటీ, ‘జాతిరత్నాలు’ ఫేమ్ ఫరియా అబ్దుల్లా తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. అల్లరి నరేశ్‌తో కలిసి నటించిన తన అప్ కమింగ్ మూవీ ‘ఆ.. ఒక్కటీ అడక్కు’ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నటి.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
Nenu ninnane Naresh sir ni “Iccheyandi sir… title iccheyandi annaanu”, kaani adhi aayane chepthaaru anta. Appati dhaaka nannu kooda ilaane undamannaaru.@allarinaresh #Naresh61 pic.twitter.com/YasuSCNWqa
— Faria Abdullah (@fariaabdullah2) February 15, 2024
అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుంది..
ఈ మేరకు మే 3న థియేటర్లలోకి రానుండగా.. తప్పకుండా అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తుందని చెప్పింది. అందరికీ అవసరమయ్యే కథ ఇది. పెళ్లికి సంబంధించిన ఓ సమస్య చుట్టూ తిరుగుతుంది. ప్రేక్షకులను సహజంగా నవ్విస్తుంది. ఈ చిత్రంలో నా పాత్ర పేరు సిద్ధి. చాలా స్వేచ్ఛగా జీవించే పాత్ర. హీరో పాత్ర నా పాత్రకు పూర్తి భిన్నంగా ఉంటుంది. అయితే రెండు పాత్రల మధ్య ఓ మంచి సంఘర్షణ ఉంటుంది. నా పాత్ర నా నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే సవాల్‌గా అనిపించలేదు’ అని చెప్పింది.
ఇది కూడా చదవండి: K. E. Gnanavel Raja : పని మనిషికి వేధింపులు.. ‘సింగం’ నిర్మాతపై కేసు నమోదు!
అలాగే జీవిత భాగస్వామిని ఎంచుకునే విషయంలో చాలా సెలక్టివ్‌గా ఉంటానని చెప్పింది. పెళ్లి విషయంలో నాకంటూ కొన్ని ఆలోచనలున్నాయి. ప్రస్తుతం నా దృష్టంతా నా సినీ కెరీర్‌పైనే ఉంది. నాకు 30ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తా. నేను కచ్చితంగా ప్రేమ వివాహమే చేసుకుంటా. నాకు టిపికల్ హీరోయిన్గా మాస్ మసాలా సినిమా చేయాలని ఉంది. అలాగే మంచి కామెడీ, హారర్ థ్రిల్లర్స్ చేయాలనుకుంటున్నా. ‘మత్తువదలరా 2’, ‘భగవంతుడు’ అనే సినిమాలు చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది.