Cake Recipe : పిల్లల చిరు తిండ్లు అంటే బాగా ఇష్టపడతారు. వాటిలో ముఖ్యంగా కేక్స్(Cakes), చాక్లెట్స్(Chocolates) మరీ ఇష్టంగా తింటారు. కానీ కొన్ని సార్లు బయట దొరికే కేక్స్ అంత హెల్తీ గా ఉండకపోవచ్చు. కావున మీ పిల్లల కోసం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసే.. చాక్లెట్ బననా కేక్(Chocolate Banana Cake) రెసిపీ తయారు చేసే విధానం చూసేయండి.
చాక్లెట్ బననా కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు
మైదా పిండి : ఒక కప్పు, గుడ్లు: 2, షుగర్: 1/2 కప్పు, ఆయిల్: 5 టీ స్పూన్స్, అరటి పండ్లు: 2, కోకో పౌడర్: 3 టేబుల్ స్పూన్స్ , బేకింగ్ పౌడర్: 1 టీ స్పూన్, బేకింగ్ సోడా: 1/2 టీ స్పూన్, వెనిల్లా ఎస్సెన్స్: 1 టీ స్పూన్, సాల్ట్: సరిపడ, మిల్క్ లేదా నీళ్లు: 1/4 కప్
Also Read : Prawns : రొయ్యలు అంటే ఇష్టమా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి
తయారు చేసే విధానం
Step – 1
ముందుగా అరటి పండ్ల తొక్కలు తీసేసి.. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
Step – 2
తర్వాత ముక్కలను బ్లెండర్ వేసి దాంట్లో వెన్నిలా ఎస్సెన్స్ , ఎగ్స్, షుగర్ కలిపి బాగా బ్లెండ్ చేయాలి. మిశ్రమం స్మూత్ గా వచ్చే వరకు ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి.
Step – 3
స్మూత్ పేస్ట్ అయిన తర్వాత.. ఈ మిశ్రమంలో కోకో పౌడర్, మైదా పిండి, బేకింగ్ పౌడర్, పించ్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలపాలి. కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేయాలి.
Step – 4
ఆ తరువాత తయారు చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ బేకింగ్ డిష్ లోకి వేయాలి. ఒక వేళ కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కాస్త మిల్క్ లేదా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. కేక్ బ్యాటర్ బేకింగ్ డిష్ లో వేసే ముందు అడుగు భాగంలో పార్చ్మెంట్ పేపర్ ఉండేలా చూసుకోండి. ప్రాపర్ షేప్ కోసం ఇది ఉపయోగపడుతుంది.
Step – 5
కేక్ ఓవెన్ లో పెట్టేముందు.. ఓవెన్ ను 180°C వద్ద ప్రీ హీట్ చేసుకోవాలి. ఆ తరువాత కేక్ ను ఓవెన్ లో పెట్టి 35 – 40 నిమిషాల పాటు బేక్ అవ్వనివ్వాలి. అలాగే కేక్ సరిగ్గా బేక్ అవుతుందా..? లేదా అని రెగ్యులర్ గా చెక్ చేయడం తప్పని సరి.
Step – 6
పూర్తిగా కేక్ బేక్ అయిన తర్వాత దానిని ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే సింపుల్ ప్రాసెస్ తో.. యమ్మీ యమ్మీ(Yummy, Yummy) టేస్టీ కేక్ రెడీ. దీనికి మరింత ఫ్లేవర్, అందం యాడ్ చేయడానికి కేక్ పై చాక్లెట్ సిరప్, జెమ్స్ తో గార్నిష్ చేస్తే అదిరిపోతుంది.
Also Read: Tea In Paper Cups: పేపర్ కప్పులో టీ తాగితే ఇంత ప్రమాదమా..! అస్సలు లైట్ తీసుకోకండి