Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లా ఒంగోలులో వైసీపీ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. మేయర్ గంగాడ సుజాత టీడీపీలో చేరారు. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు మరికొంత మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు.
balineni srinivasa reddy
Balineni Srinivasa Reddy: త్వరలో టీడీపీలోకి వైసీపీ మాజీ మంత్రి.. క్లారిటీ
Balineni Srinivasa Reddy: అజ్ఞాతం వీడారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. దాదాపు 40 రోజుల తరువాత ఒంగోలు (Ongole) నగరానికి వచ్చారు. జూన్ 04 ఎన్నికల కౌంటింగ్ తరువాత నగరాన్ని వీడిన బాలినేని కుటుంబం.. తాగాజా ఒంగోలుకు వచ్చారు. వారికి ఘనస్వాగతం పలికారు వైసీపీ పార్టీ శ్రేణులు.
పార్టీ మార్పుపై క్లారిటీ..
తనపై వస్తున్న ఆరోపణలు అంతా అవాస్తవం అని అన్నారు బాలినేని. ఏవైనా ఆధారాలు ఉంటే ముందుకు రావాలని అన్నారు. కొన్ని చానల్స్ కావాలని తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను పార్టీ మారను.. అవసరం లేదని స్పష్టం చేశారు. తాను YCP లోనే కొన సాగుతాను… మరోసారి పోటీలో ఉంటా అని తేల్చి చెప్పారు. కార్యకర్థలకోసం .. బాలినేని అభిమానులకోసం తాను భరిలో నిలుస్తాను అని అన్నారు. త్వరలోనే అన్ని విషయాలకు సమాధానం చెబుతానని చెప్పారు.
Balineni : వైసీపీ నుంచి బాలినేని జంపింగ్ జంపాంగా..?
Balineni In Trouble : వైసీపీ (YCP) శ్రేణుల్లో తీవ్ర నిస్తేజం కనిపిస్తుంది. పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడే మోహం చాటేసి తిరుగుతుండడంతో పార్టీ విడిచి పెట్టేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒంగోలు కార్పొరేటర్లు… చాలా మంది పార్టీని విడిచిపెట్టారు. ఈ క్రమంలోనే పార్టీ జిల్లా బాధ్యతలనూ ఎంపీగా ఓటమి పాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డి కి ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో భారీ ఓటమి తరువాత మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivasa Reddy).. సోమవారం తొలిసారిగా నగరానికి వస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలను ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే నాలుగేళ్ల నుంచి క్యాడర్ కు బాలినేని అందుబాటులో లేరు. ఒంగోలు (Ongole) వచ్చినప్పటికీ కూడా పార్టీలో అంత చురుకుగా పాల్గొనలేదు. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయారు.
ఎన్నికల తరువాత పార్టీ అధ్యక్షుడు జగన్ (YS Jagan) నిర్వహించిన సమీక్షలకు దూరంగా ఉన్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారన్న చర్చ నడుస్తుండడంతో పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ తో కార్పొరేటర్లు అంతా టచ్ లో ఉన్నారు.
దీంతో ఒకేసారి పెద్ద సంఖ్యలో టీడీపీ (TDP) లో చేరేందుకు రంగం సిద్దం అవుతున్నట్లు తెలుస్తుంది. దీంతో ఒంగోలు కార్పొరేషన్ ను చేజిక్కించుకునేందుకు టీడీపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి ఓటమిపాలైన తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా నియమించేందుకు పార్టీ అధిష్టానం యోచిస్తుంది.
అదే జరిగితే తాను పార్టీ వీడటానికైనా సిద్దమని వైసీపీ పెద్దలకు బాలినేని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే బాలినేనిని సజ్జల బుజ్జగించేందుకు యత్నం చేస్తున్నట్లు ప్రచారం.
AP: వైసీపీ మాజీ మంత్రి బాలినేని అక్రమాలపై సుబ్బారావు గుప్తా ఎక్స్‌క్లూజివ్.!
YCP Balineni Srinivasa Reddy: వైసీపీ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అక్రమాలపై టీడీపీ నేత సుబ్బారావు గుప్తా (TDP Subbarao Gupta) సాక్ష్యాలతో వివరణ ఇచ్చారు. RTVతో ఆయన ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ..మాజీ మంత్రి బాలినేని, అతని వియ్యంకుడు భాస్కర్ రెడ్డి ఎక్కడ? ఎంత? ఎలా? దోచుకున్నారో.. అధికార దుర్వినియోగం ఎలా చేశారో RTVకి వివరించారు.
Also Read: రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నలుగురు ఐపీఎస్‌ల పాత్ర.. మంత్రి నాదెండ్ల సంచలన వ్యాఖ్యలు.!
పూర్తిగా రియల్ ఎస్టేట్ వెంచర్ కోసం నకిలీ అనుమతి తీసుకున్నారన్నారు. వే బిల్ ద్వారా కొండను తొలిచేసారన్నారు. వరద ఉదృతిని తట్టుకునేందుకు ఏర్పాటు చేసిన నల్ల కాలువను సైతం ఆక్రమించారన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నగరపాలక సంస్థ నీటి సరఫరాను, ఇసుకను అక్రమంగా తరలించారని తెలిపారు.
Also Read: చంపేస్తానని బెదిరించాడు.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాధితురాలు..
ఇంకా అనేక చోట్ల ఇలా అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయని.. వాటి నిగ్గు త్వరలో తేలుస్తానని వెల్లడించారు. జరిగిన అవినీతి, అక్రమాలపై ఉన్నతాధికారులకు, పాలకులకు ఫిర్యాదు చేస్తానని.. న్యాయం కోసం పోరాడుతానని ఉద్ఘాటించారు.
YCP VS TDP : ఒంగోలులో రణరంగంగా మారిన ప్రచారం!
AP : ఏపీ రాజకీయాలు(AP Politics) రోజురోజుకి వేడివేడిగా మారుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యర్థులు మాటల యుద్దాలకు దిగుతుంటే.. మరికొన్ని చోట్ల ఏకంగా చేతలకు పని చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఒంగోలు సమతానగర్ లో బుధవారం రాత్రి ఎన్నికల ప్రచారం లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఒంగోలు(Ongole) వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాస్ రెడ్డి(Balineni Srinivasa Reddy) కోడలు కావ్యారెడ్డి(Kavya Reddy) తో పాటు వాలంటీర్ సుజన ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రచారంలో వాలంటీరు పాల్గొనడంతో టీడీపీ కార్యకర్త ప్రభావతి ఎన్నికల ప్రచారానికి వాలంటీర్ ని ఎందుకు తీసుకుని వచ్చారని ప్రశ్నించారు.
దీంతో ఆమెతో పాటు, ఆమె పిల్లల పై కూడా వైసీపీ(YCP) కార్యకర్తలు దాడులకు దిగారు. దాడికి పాల్పడిన వారిలో వైసీపీ నేతలు రామానాయుడు, కృష్ణారెడ్డి, బిన్నీ స్థానిక కార్పొరేటర్ భర్త తిరుపతిరావులు ఉన్నారు. దీంతో టీడీపీ నేత మేడికొండ మోహన్ ఇతర కార్యకర్తలతో కలిసి ప్రభావతిని పరామర్శించడానకిఇ ఆమె ఇంటికి వెళ్లారు. వారిని వైసీపీ కార్యకర్తలు అడ్డగించి దాడికి దిగారు. దీంతో మోహన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.
విషయం తెలుసుకున్న టీడీపీ(TDP) నేతలు , ఇతర నాయకులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వైసీపీ నేతలు దాడులు చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాడిలో గాయపడిన వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వాలంటీర్ సుజనను పరామర్శించేందుకు జిల్లా ఆసుపత్రికి బాలినేని రాగా, టీడీపీ కార్యకర్తలలను పరామర్శించేందుకు జనార్థన్, ఇతర నేతలు అక్కడికి వెళ్లారు. ఇరు పార్టీల నేతలు ఎదురవడంతో అక్కడ ఇద్దరు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో టీడీపీ-వైసీపీ నాయకుల మధ్య జరిగిన గొడవ గురించి మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందించారు.
ప్రచారంలో ఉన్న YCP వారిపై ధాడిచేయడం TDP నాయకులకు ఆనవాయితీ అయ్యిందని ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు ఇలానే చేసారు.. ప్రజలు బుద్ధి చెప్పారు తనను ఏమన్నా సహించాను.. తన కుటుంబం జోలికి వచ్చారుఇక నేను ఊరుకోను. నేను ఉన్నంత సహనంగా.. నా అభిమానులు ఉండకపోవొచ్చు అంటూ బాలినేని పేర్కొన్నారు.
దాడులు చేసింది టీడీపీ వారే… ధర్నాలు చేసేది వారే. ప్రచారంలో ఉన్న మా కోడలని, మహిళను ఇష్టమొచ్చినట్లు దుర్బాషలాడితే నేను ఊరుకోను అని హెచ్చరించారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. ఇన్ని సంవత్సరాలుగా రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడూ ఇలాంటి హింసా రాజకీయాలు ప్రోత్సహించలేదని అన్నారు. సహనానికి ఒక హద్దు ఉంటుంది .. అధి దాటితే పరిస్థితులు వేరుగా ఉంటాయి.ఇలాంటి చిల్లర రాజకీయాలు మానకపోతే ప్రజలే బుద్ధిచెబుతారని బాలినేని అన్నారు.
Also Read : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు!
Balineni Srinivasa Reddy: వైసీపీకి మాజీ మంత్రి బాలినేని గుడ్ బై?
MLA Balineni Srinivasa Reddy: నేతల రాజీనామాలు చేరికలతో ఏపీ రాజకీయాలు (AP Politics) వేడెక్కాయి. గత కొన్ని రోజులుగా ఒంగోలు (Ongole) వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA), మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో (TDP) చేరుతారనే ప్రచారం జోరందుకుంది. జరుగుతున్న ప్రచారానికి చెక్ పెట్టారు మాజీ మంత్రి బాలినేని. వైసీపీ విడడంపై క్లారిటీ ఇచ్చారు.
సీఎం జగన్ అలిగిన..
కొంతమంది తాను సీఎం జగన్ పై (CM Jagan) అలిగాను అని ప్రచారం చేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బాలినేని. తాను ప్రజల కోసం ప్రశ్నించే మనిషినని పదవుల కోసం ఎదురుచూసే మనిషిని కాదని పేర్కొన్నారు. ఉన్న విషయం ఉన్నట్టుగా చెపుతా అని అన్నారు. ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసినట్లు తెలిపారు. అవసరం అయితే రాజకియాలు మానుకొంటాను కాని ప్రశ్నించడం మానుకోను అని తేల్చి చెప్పారు.
ALSO READ: మారుతున్న రాజకీయాలు.. వైసీపీలోకి వంగవీటి రాధా?
డబ్బులు లేక..
పీఆర్సీ ఇంకా అమలు తమ ప్రభుత్వం అమలు చేయకపోవడంపై వివరణ ఇచ్చారు మంత్రి బాలినేని. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకనే పీఆర్సీని సీఎం జగన్ ఇవ్వలేదని ఇవ్వలేదని.. త్వరలోనే వస్తాయని భరోసాను ఇచ్చారు. ప్రజల సమస్యలను తీర్చేందుకే నిధులు సమీకరించాడని సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలిశారు అన్నారు.
టీడీపీలో చేరుతానా?..
సీఎం జగన్ పై మాగుంట శ్రీనివాస్ రెడ్ది కోసం పోరాడినట్లు తెలిపారు. ఆయనతో పాటు టీడీపీలోకి పోవాలనుకోలేదని తేల్చి చెప్పారు. చిత్త శుద్దితో ఉంటే ఎవరు ఏమి మాట్లాడినా లెక్కచెయ్యక్కర్లేదని హితవు పలికారు. పార్టీ లో ఉండి ద్రోహం చేసే వ్యక్తి ని తాను కాదని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చెప్పిన మాటలే తనకు ఆదర్శం అన్నారు. సీఎం జగన్ కోసం పనిచేస్తానని..టీడీపీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమని స్పష్టం చేశారు.