Nara Lokesh: నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానం మొదలై 50 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ బాలయ్య స్వర్ణోత్సవ సంబరాలు సెలెబ్రేట్ చేయనుంది. తెలుగు ఇండస్ట్రీలోని పలు యూనియన్లు కలిసి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించనున్నాయి. సెప్టెంబర్ 1న నోవాటెల్ హోటల్ లో జరగనున్న ఈ వేడుకలకు తెలుగు సినీ పరిశ్రమలోని స్టార్ తో తమిళ్, కన్నడ, మలయాళ నటులు కూడా హాజరు కానున్నారు.
నారా లోకేష్ పోస్ట్
ఈ సందర్భంగా బాలయ్య అల్లుడు, ఎమ్మెల్యే నారా లోకేష్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. యాభై ఏళ్లుగా వెండితెర పై తిరుగులేని కథానాయకుడిగా వెలుగొందుతున్న బాలయ్య మావయ్యకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. నారా లోకేష్ తన పోస్ట్ లో ఇలా రాసుకొచ్చారు.. “‘తాతమ్మకల’తో 1974వ సంవత్సరంలో తెరంగేట్రం చేసిన వేయని పాత్ర లేదు.. చేయని ప్రయోగం లేదు.. ఐదు దశాబ్దాలలో హీరోగా ఎన్నో అవార్డులు, రివార్డులను అందుకొని రికార్డు సృష్టించారు. ప్రయోజనాత్మక గాడ్ ఆఫ్ మాసెస్ గా పేరొందారు. అగ్రహీరోగా వెలుగొందుతూనే.. రాజకీయాల్లో రాణిస్తూ ప్రజలకు సేవలందించారు. నటనతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనస్సులు గెలుచుకున్న అన్ స్టాపబుల్ హీరో మా బాల మామయ్య అని తన అభిమానాన్ని చాటుకున్నారు లోకేష్.”
Also Read: చిరు, బన్నీని కలపబోతున్న బాలయ్య.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా వస్తారా? – Rtvlive.com