Balayya : రామ్ చరణ్ ను ఫాలో అవుతున్న బాలయ్య.. వర్కౌట్ అవుతుందా?

'గేమ్ ఛేంజర్' తో పాటూ బాలయ్య 'డాకూ మహారాజ్' ఈవెంట్ ను సైతం అమెరికాలోనే నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. జనవరి 4వ తారీకు సాయంత్రం అమెరికాలోని డల్లాస్ లో ఈవెంట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య కూడా హాజరుకాబోతున్నట్లు సమాచారం.

New Update
balayya55

మన టాలీవుడ్ స్టార్ హీరోలకు ఓవర్సీస్ లో భారీ మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే. ఈ మధ్య సీనియర్ హీరోల సినిమాల నుంచి యంగ్ హీరోల సినిమాలు కూడా ఓవర్సీస్ లో మిలియన్ డాలర్స్ ను కొల్లగొడుతున్నాయి. అందుకే స్టార్ హీరోలు తమ సినిమాలను ఓవర్సీస్ లో కూడా ప్రమోషన్స్ చేయడం స్టార్ట్ చేశారు. 

తాజాగా  రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే కదా. అక్కడ  జరగబోయే మొదటి ఇండియన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇదే కావడం విశేషం. ఇప్పుడు ఈ లిస్ట్ లో బాలయ్య కుడా చేరిపోయారు. ఆయన కొత్త సినిమా 'డాకూ మహారాజ్' ఈవెంట్ ను సైతం అమెరికాలోనే నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

Also Read : సుకుమార్ నెక్స్ట్ సినిమాలో సాయి పల్లవి.. హీరో ఎవరంటే?

 డల్లాస్ లో 'డాకూ మహారాజ్' ఈవెంట్..

'గేమ్ ఛేంజర్' తో పాటూ బాలయ్య  'డాకూ మహారాజ్' కూడా సంక్రాంతికే రిలీజ్ అవుతోంది. జనవరి 12 న ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేయనుండగా.. జనవరి 4వ తారీకు సాయంత్రం అమెరికాలోని డల్లాస్ లో డాకు మహారాజ్ ఈవెంట్ చేయనున్నారు. ఈ ఈవెంట్ కు బాలయ్య కూడా హాజరుకాబోతున్నటు సమాచారం. 

డల్లాస్ అంటేనే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే ప్లేస్, అందులోను అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు. గతంలో అమెరికా నుంచి జై బాలయ్య స్లొగన్స్ తో వచ్చిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా బాలయ్య కొత్త సినిమా ఈవెంట్ అక్కడే ప్లాన్ చేయడంతో కచ్చితంగా ఈ ఈవెంట్ కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు