నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 'ఆదిత్య 369' సినిమాకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1991 లో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది. అలాగే తెలుగులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో వచ్చిన మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచింది.
ముఖ్యంగా ఈ సినిమాలో శ్రీ కృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ పోషించిన పాత్ర ప్రేక్షకులపై చెరగని ముద్ర వేసింది. అయితే గత కొన్నేళ్లుగాఈ చిత్రానికి కొనసాగింపుగా సీక్వెల్ కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించాయి. బాలయ్య తాజాగా ‘ఆదిత్య 369' మూవీకి సీక్వెల్ ప్రకటించారు.
The Time Machine is back, and it's BIGGER than ever! 🕰️✨#NandamuriBalakrishna announces the sequel to Aditya 369, titled Aditya999Max, with @MokshNandamuri in the lead! 🔥
— NBK UPDATES (@NbkUpdates) December 4, 2024
Get exclusive details from #NBK on #UnstoppableWithNBK4, Episode 6, streaming December 6, 2024! pic.twitter.com/m5gwVCGkb2
Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!
మోక్షజ్ఞ హీరోగా..
అన్‌స్టాపబుల్ విత్ NBK (సీజన్ 4) ఆరవ ఎపిసోడ్‌లో బాలకృష్ణ 'ఆదిత్య 369'కి సీక్వెల్ రాబోతుందని వెల్లడించాడు. దీనికి 'ఆదిత్య 999 మ్యాక్స్' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపాడు. ఈ మూవీలో బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా నటించనున్నాడు.
ఈ అప్‌డేట్ తెలియజేయడం కోసం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ విత్ NBK అప్ కమింగ్ ఎపిసోడ్‌లో ఆదిత్య 369 అవతార్‌లో కనిపించనుండటం విశేషం. 'ఆదిత్య 999' మ్యాక్స్ ప్రత్యేక గ్లింప్ల్స్‌తో పాటు ఈ సినిమా గురించి మరిన్ని వివరాలను డిసెంబర్ 6న ఆహాలో ప్రసారం కానున్న 'అన్ స్టాపబుల్ 4' ఎపిసోడ్ లో రివీల్ చేయనున్నారు.
Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!