Devara Third Single : టాలీవుడ్ (Tollywood) యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR) – కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘దేవర’. ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ (Janhvi Kapoor) కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఎన్టీఆర్ మాస్ యాక్షన్ విజువల్స్, లుక్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.
థర్డ్ సింగిల్ అప్డేట్
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ‘దావుడి’ అనే పేరుతో థర్డ్ సింగిల్ త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు ట్వీట్ చేశారు. జాన్వీ, తారక్ మధ్య ఉండే ఈ మాస్ డ్యూయెట్ అదిరిపోనున్నట్లు హిట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన దేవర ఆంథెమ్, సెకండ్ సింగిల్ చుట్టమల్లే సాంగ్స్ యూట్యూబ్ లో మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించుకున్నాయి.
#Daavudi , next single from #Devara 🎉🎉🎉@tarak9999 anna and #JanhviKapoor on fire🕺💃🔥#KoratalaSiva sir ⚡️⚡️⚡️
— Anirudh Ravichander (@anirudhofficial) September 1, 2024
యువసుధా, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ బైరా అనే పాత్రలో కనిపించబోతున్నట్లు ఇప్పటికే పోస్టర్ రిలీజ్ చేశారు.