Viral Video : అనిరుధ్ కన్నా నువ్వే తోపు.. గల్లీ కుర్రోడి మ్యూజిక్ కు నెటిజన్లు ఫిదా! అబ్బసొత్తు కాదురా.. టాలెంట్ అని నిరూపించారు ఈ చిన్నారులు. కేవలం టేబుల్స్, బకెట్స్, స్టిక్స్ సహాయంతో లియో సినిమాలోని అనిరుధ్ హిట్ సాంగ్ 'బాదాస్ మా' అద్భుతంగా ప్లే చేసి ఔరా అనిపించారు. అనిరుధ్ ను తలదన్నేలా ఉందంటూ నెటిజన్లు వీరి వీడియోను వైరల్ చేస్తూ అభినందిస్తున్నారు. By Archana 21 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Viral Video Of Children Playing Anirudh Badass Song : టాలెంట్ (Talent) ఎవరిసొత్తు కాదురా.. అని నిరూపించారు ఈ చిన్నారులు. టాలెంట్ ఉన్నవారు లైఫ్ లో ఎదగడానికి ఎవరి సహాయం అవసరం లేదని, అదే వారిని ప్రపంచానికి పరిచయం చేస్తుందని ఈ వీడియోతో మరో సారి అర్థమైంది. అసలు దేని గురించి మాట్లాడుతున్నారు.. అని ఆలోచిస్తున్నారా..? . అదేంటో ఇప్పుడు తెలుసుకుందాము వైరల్ వీడియో చాలా మంది తమ చుట్టూ సకల సౌకర్యాలు ఉన్నా.. ఇంకా ఏదో తక్కువైందని బాధపడుతుంటారు. మరి కొంత మంది వారికి ఉన్నదాంట్లోనే అద్భుతాలను ఎలా సృష్టించాలని ఆలోచిస్తూ ఉంటారు. ఇప్పుడు అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియా (Social Media) లో వైరలవుతోంది. ఎటువంటి మ్యూజిక్ ఇంస్ట్రుమెంట్స్ సహాయం లేకుండా ఈ పిల్లలు కంపోజ్ చేసిన పాటకు అంతా ఆశ్ఛర్యపోతున్నారు. కేవలం టేబుల్స్, బకెట్స్, స్టిక్స్ సహాయంతో లియో సినిమాలోని అనిరుద్ హిట్ సాంగ్ 'బాదాస్ మా' అద్భుతంగా ప్లే చేశారు ఈ చిన్నారులు. సోషల్ మీడియాలో ఈ పాట విన్న నెటిజన్లు ఆ పిల్లల పై ప్రశంసల కురిపిస్తున్నారు. "మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ (Anirudh) కూడా ఆశ్చర్యపోతాడు .. వీళ్ల సంగీతం, గాత్రం వింటే… అద్భుతం" అని కొంతమంది.. "ఇలాంటి టాలెంట్ ఉన్నవారికి కాస్త సపోర్ట్ చేస్తే గొప్ప స్థాయికి వెళ్తారు అని మరికొంతంది కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళు కంపోజ్ చేసిన ఈ అద్భుతమైన సాంగ్ మీరు కూడా వినండి. Also Read: Sitara Ghattamaneni: ''ఐ లవ్ యూ మై స్వీట్ హార్ట్''... నమ్రత వీడియో వైరల్ ...! - Rtvlive.com #viral-video #badass-song #anirudh-ravichander మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి