Coolie: 'కూలీ' నుంచి ఫస్ట్ సాంగ్.. మాస్ స్టెప్పులతో అదరగొట్టిన రజినీ, అనిరుధ్ !

రజినీకాంత్ 'కూలీ' నుంచి  ఫస్ట్‌ సాంగ్‌ ‘చికిటు’ పాటను విడుదల చేశారు. ఫుల్ జోష్ గా సాగిన ఈ పాటలో రజినీ, అనిరుధ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఈ పాటను మీరు కూడా చూసేయండి. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది.  

New Update

Coolie: రజినీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కిన  'కూలీ' ఆగస్టు 14న థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గరపడుతుండడంతో మెల్లిగా మూవీ ప్రమోషన్స్ షూరూ చేశారు మేకర్స్.  ఈ నేపథ్యంలో తాజాగా మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో  'చికిటు' పాటను రిలీజ్ చేశారు. ఫుల్ జోష్ గా సాగిన ఈ పాటలో రజినీ, అనిరుధ్ మాస్ స్టెప్పులతో అదరగొట్టేశారు. ఇందులో  రజినీకాంత్ స్టైల్, ఎనర్జీ అదిరిపోయాయి. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్సులో, తన ట్రేడ్‌మార్క్ స్టైల్‌లో కనిపించారు. అలాగే అనిరుధ్ కూడా మెడలో కర్చీఫ్ తో మాస్ అవతార్ లో ఆకట్టుకున్నాడు. అనిరుధ్ అదిరిపోయే బీట్స్‌తో పాటను కంపోజ్ చేయగా, రజినీకాంత్ తనదైన మార్క్ చూపించారు. ఈ పాటను మీరు ఎంజాయ్ చేయండి. 

Also Read:Chiranjeevi: శేఖర్ కమ్ముల చేయి వేయగానే చిరంజీవి ఎలా చేశారో చూడండి! వీడియో వైరల్

Advertisment
తాజా కథనాలు