Anirudh: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన పెళ్లి గురించి వస్తున్న రూమర్ల పై స్పందించారు. అయితే కొద్దిరోజులుగా అనిరుధ్ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ ను వివాహం చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఈ పుకార్లకు చెక్ పెడుతూ.. అనిరుద్ తన ఎక్స్ ద్వారా స్పందించారు. "మ్యారేజ్! అహా.... చిల్ అవుట్ గయ్స్. దయచేసి పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి" అంటూ ట్వీట్ చేశారు. ఈ ఒక్క పోస్టుతో అనిరుధ్ తన పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పెట్టారు.
Also Read: Father's Day 2025: ఫాదర్ సెంటిమెంట్ తో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
Marriage ah? lol .. Chill out guys 😃 pls stop spreading rumours 🙏🏻
— Anirudh Ravichander (@anirudhofficial) June 14, 2025
బ్రాండ్ న్యూ పోర్షే కార్
ఇదిలా ఉంటే కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన 'జైలర్' సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించారు. అనిరుధ్ మ్యూజిక్ ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది. ఊహించని విధంగా వరల్డ్ వైడ్ 650 కోట్లు వసూళ్లు చేయడంతో నిర్మాతలు ఫుల్ హ్యాపీ అయ్యారు. దీనికి కృతజ్ఞతగా దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌లకు బ్రాండ్ న్యూ పోర్షే కార్లుతో పాటు భారీ మొత్తంలో చెక్కులను అందజేసినట్లు సమాచారం. అలాగే హీరో రజినీకాంత్‌కు ఒక BMW X7 కారును కూడా బహుమతిగా ఇచ్చారని టాక్.
అగ్ర తారలతో సినిమాలు
ప్రస్తుతం అనిరుధ్ పలు అగ్ర చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉన్నారు.విజయ్ 'జన నాయగన్', విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్', ఏ.ఆర్. మురుగదాస్ 'మదరాసి', విఘ్నేష్ శివన్ 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ', నాని 'పారడైజ్' సినిమాలకు సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
Also Read: Nabha Natesh: వన్ పీస్ లో హాట్ నెస్ పెంచేసిన ఇస్మార్ట్ బ్యూటీ!