70th National Film Awards: సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే 70th నేషనల్ ఫిల్మ్ అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2022 డిసెంబర్ 31 నాటికి సెన్సార్ అయిన అవార్డులు అందిస్తుంది. ఇందులో టాలీవుడ్ నుంచి ఉత్తమ ప్రాంతీయ చిత్రం కేటగిరీలో బలగం, సీతారామం, కార్తికేయ 2 చిత్రాలు పోటీ పడగా.. కార్తికేయ 2కు నేషనల్ అవార్డు వరించింది.
నిఖిల్ పోస్ట్
ఇక ‘కార్తికేయ 2’ నేషనల్ అవార్డు గెలుచుకోవడం పై హీరో నిఖిల్ సంతోషం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వీడియోను రిలీజ్ చేశారు. నిఖిల్ మాట్లాడుతూ.. “‘కార్తికేయ 2’ కు నేషనల్ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. సినిమా ఇంత సక్సెస్ అవ్వడానికి, అవార్డు రావడానికి ముఖ్య కారణం మా ఎంటైర్ మూవీ టీమ్. నిర్మాతలు అభిషేక్ అగర్వాల్, విశ్వప్రసాద్, డైరెక్టర్ చందూ మొండేటీ, హీరోయిన్ అనుపమ, నటీనటులకు, ప్రేక్షకులందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని తెలియజేశారు.”
Also Read: Victory Venkatesh: వెంకటేష్ 38 ఏళ్ళ సినీ ప్రయాణం..! వీడియో వైరల్ – Rtvlive.com