Kishan Reddy: కేసీఆర్ ఖేల్ ఖతం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు TG: కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు టీ-బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కేసీఆర్ పోయిండు.. ఇక ఆయన పనైయిపోయింది.. మల్ల రాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. ఆయన ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరన్నారు. By V.J Reddy 21 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Kishan Reddy: కేసీఆర్ పోయిండు.. ఇక ఆయన పనైయిపోయింది.. కేసీఆర్ మల్ల రాడు అంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే... అలవికాని వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్‌పై సెటైర్లు వేశారు. కేసీఆర్ బస్సు యాత్ర ఎందుకు చేస్తున్నారో తెలియదన్నారు. కేసీఆర్ పని అయిపోయిందని, కేసీఆర్ ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మరని.. ఓట్లు పడవని అన్నారు. ALSO READ: చంద్రబాబుతో పవన్‌కు డేంజర్ సజ్జల హాట్ కామెంట్స్ బీజేపీది ప్రజల మేనిఫెస్టో.. బీజేపీ మేనిఫెస్టో ప్రజల మేనిఫెస్టో అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్ సభ ఎన్నికల మేనిఫెస్టో తెలుగు వెర్షన్ ‘మన మోడీ గ్యారంటీ 2024’ పేరుతో విడుదల చేశారు. మోడీ గ్యారంటీ అంటే కచ్చితంగా అమలుచేసేస్తారని చెప్పారు. 2047 వికసిత భారత్ పేరుతో బీజేపీ ముందుకెళ్తోందన్నారు. అవినీతి, బంధుప్రీతిని కాంగ్రెస్ పూర్తిగా వదిలిపెట్టలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. సమాజంలోని అట్టడుగున ఉన్న యువకులు, మహిళలు, పేదలు, రైతుల అభ్యున్నతికి పాటుపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. 25న అమిత్ షా ప్రచారం.. కేంద్ర హోం మంత్రి 25వ తేదీన అమిత్ షా తెలంగాణకు వస్తున్నారని తెలిపారు కిషన్ రెడ్డి. ఒక పార్లమెంట్ సెగ్మెంట్ లో ఆయన సభ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విడదల వారిగా జాతీయ నేతల సభలు ఉంటాయని, ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. అలాగే మోదీ కూడా తెలంగాణలో ప్రచారంలో పాల్గొంటారని అన్నారు. సభల కంటే ఓటర్లను రీచ్ అయ్యేలా కార్యక్రమాలు చేస్తామన్నారు. #brs #kcr #lok-sabha-elections #kishan-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి