/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/symptoms-of-heart-blockage-and-how-to-prevent-it--jpg.webp)
Heart Health:కొన్నేళ్లుగా గుండెజబ్బుల ముప్పు వేగంగా పెరుగుతోంది. గుండె ఆరోగ్యం విషయంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మంచి ఆహారం తినకుండా, జీవనశైలి అస్థవ్యస్థంగా ఉండడం గుండె సమస్యల ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. హార్ట్ అటాక్ సమస్యలు పెరగడానికి గుండె ధమనుల్లో అడ్డంకులు ఒక కారణం. దీన్నే హార్ట్ బ్లాకేజ్ అంటారు.
రక్త ప్రసరణ దెబ్బతింటుంది:
- గుండెకు రక్తాన్ని చేరవేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడటం వల్ల గుండెకు చేరే రక్తం వేగం తగ్గుతుంది. ఇది కండరాలు దెబ్బతినే ప్రమాదాన్ని కలిగిస్తుంది. గుండెకు రక్త ప్రసరణకు అంతరాయం ఏర్పడితే గుండె మరింత కష్టపడాల్సి వస్తుంది. దీనివల్ల అనేక తీవ్రమైన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. గుండె కవాటాల వ్యాధులు, గుండె నిర్మాణానికి సంబంధించిన సమస్యలు కూడా హార్ట్ బ్లాకేజ్‌కు కారణమవుతాయి. ధమనుల్లో ఫలకం ఏర్పడే సమస్య కూడా హార్ట్ బ్లాకేజ్‌కు కారణం. ఇలా జరిగినప్పుడు రక్త ప్రసరణ దెబ్బతింటుంది. దీనివల్ల అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు:
--> ఛాతీ నొప్పి
--> అలసట
--> వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన
--> శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
--> చేతులు లేదా కాళ్ళలో వాపు
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించే చర్యలు, మద్యపానం-ధూమపానానికి దూరంగా ఉండటం వల్ల గుండె సమస్యలను నివారించవచ్చు.. అదే సమయంలో హార్ట్ బ్లాకేజ్ సమస్యకు చెక్ పెట్టవచ్చు.
ఇది కూడా చదవండి: మహాశివరాత్రి రోజు ఈ 4 మొక్కలు ఇంటికి తెచ్చుకుంటే వద్దన్నా డబ్బే
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
 Follow Us
 Follow Us