Delhi crime: ఢిల్లీలో స్విట్జర్లాండ్ మహిళ హత్య..వారం కిందటే భారత్ కి రాక ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు. By Bhavana 21 Oct 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి గత వారం భారత్ కు వచ్చిన స్విట్జర్లాండ్ మహిళ ఢిల్లీలో ఓ స్కూల్ పక్కన శవమై పడి ఉంది. కాళ్లు, చేతులు కట్టేసి ఆమెను అత్యంత క్రూరంగా హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. రాజధాని నగరంలో విదేశీ మహిళ హత్య ప్రస్తుతం కలకలం రేపుతుంది. వెస్ట్ ఢిల్లీలోని తిలక్ నగర్ ప్రాంతంలో మహిళ అనుమానస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులకు సమాచారం అందింది. ప్రభుత్వ స్కూల్ పక్కన నల్లని ప్లాస్టిక్ బ్యాగ్ లో కాళ్లు, చేతులు కట్టేసి ఉన్న మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలిని స్విట్జర్లాండ్ కు చెందిన 30 ఏళ్ల లీనా బెర్గర్ గా గుర్తించారు. స్విస్ మహిళతో క్లోజ్ గా ఉండే గురుప్రీత్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోనికి తీసుకుని అరెస్ట్ చేశారు. అంతే కాకుండా అతని వద్ద నుంచి సుమారు రూ. 2.25 కోట్లు డబ్బును స్వాధీనం చేసుకున్నారు. గురుప్రీత్ కి లీనాకు చాలా కాలం నుంచి స్నేహం ఉన్నట్లు తెలుస్తుంది. గురుప్రీత్ ఎప్పుడూ కూడా స్విట్జర్లాండ్ వెళ్తుండేవాడు. అయితే గురు లీనాకు వేరే వ్యక్తితో సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. ఈ క్రమంలోనే ఆమెను చంపేయాలని భావించాడు. దీంతో లీనాను భారత్ కు రమ్మని పిలిచాడు. దీంతో లీనా గత వారం ఢిల్లీ నగరానికి వచ్చింది. ఆ తరువాత ఐదు రోజుల పాటు ఆమెను ఓ గదిలో గురు బంధించాడు. కాళ్లు చేతులు కట్టేసి హత్య చేశాడు. ఆ తరువాత ఓ మహిళ పేరు మీద ఓ పాత కారును కొనుగోలు చేసి అందులో లీనా మృతదేహాన్ని దాచిపెట్టాడు. లీనా డెడ్ బాడీ రోజురోజుకి వాసన వస్తుండడంతో చెత్త పారవేసే ప్లాస్టిక్ బ్యాగ్ లో మృతదేహాన్ని ఉంచి స్కూల్ పక్కన పడేశాడు. నల్లని కవర్ నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని స్వాధీనం చేసుకోవడంతో పాటు..ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గురు ప్రీత్ అనుమానస్పదంగా తిరగడంతో పాటు ఆ సంచిని కూడా అక్కడ పడేయడం కనిపించింది. ఈ నేపథ్యంలో గురుప్రీత్ సింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మృతదేహాన్ని ఉంచిన కారుతోపాటు మరో కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. Also read: హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం..ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి! #murder #delhi #women #dead-body #swiss మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి