Breaking : ఏపీలో అల్లర్లు.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్!

ఏపీలో ఎన్నికల వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన పల్నాడు, అనంతపురం ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీలపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.

New Update
Breaking : ఏపీలో అల్లర్లు.. ఇద్దరు ఎస్పీలు సస్పెండ్!

AP : ఏపీలో ఎన్నికల(AP Elections) వేళ కొనసాగుతున్న అల్లర్లపై ఈసీ(EC) సీరియస్ అయింది. ఘర్షణలను కంట్రోల్ చేయడంలో విఫలమైన ఇద్దరు ఎస్పీలను సస్పెండ్ చేసింది. పల్నాడు, అనంతపురం, తిరుపతి పోలీసు అధికారులపై బదిలీ వేటు వేసింది. వీరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది.

publive-image

Also Read : వేలికి చేయాల్సిన సర్జరీ నాలుకకు చేశాడు.. చివరికి ఏం జరిగిందంటే..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. పల్నాడు, అనంతపురం ఎస్పీపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. అలాగే, పల్నాడు, అనంతపురం, తిరుపతి డీఎస్పీ(DSP) లను బదిలీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో పోలింగ్‌(Polling) సమయంలో, ఆ తర్వాత చోటుచేసుకున్న హింసపై ప్రతి కేసును ప్రత్యేకంగా తీసుకోవాలని, సిట్‌ ఏర్పాటు చేసి రెండ్రోజుల్లో నివేదికలు ఇవ్వాలని తెలిపింది. ఈ అధికారులందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు