Parliament Budget Session 2024 : బడ్జెట్‌ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!

ఎన్నికలకు ముందు పార్లమెంట్ చివరి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది.

Parliament Budget Session 2024 : బడ్జెట్‌ సమావేశాల్లో 146 మంది విపక్ష ఎంపీల సస్పెన్షన్స్ ఎత్తివేత..!
New Update

Parliament Budget Meetings : నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు(Parliament Elections) ముందు జరుగనున్న ఈ చివరి పార్లమెంట్ సమావేశాలను(Parliament Meeting) కేంద్ర ప్రభుత్వం(Central Government) ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. అయితే ఇప్పటివరకు 146 మంది విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జరగనున్న ఈ బడ్జెట్ సమావేశాల్లో  ఆ 146 మంది విపక్ష ఎంపీలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కేంద్రం కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి ఈ విషయాన్ని వెల్లడించారు.

Also Read : జార్ఖండ్‌ సీఎంగా కల్పనా సోరెన్‌?.. హేమంత్‌ సోరెన్‌ అరెస్టు ఖాయం!

విఘాతం కలిగించిన ఎంపీలు

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దుండగుల దాడి వల్ల అలజడి రేగిన సంగతి తెలిసిందే. దీంతో పార్లమెంటులో భద్రతా వైఫల్యంపై కేంద్ర హోంశాఖ వివరణ ఇవ్వాలంటూ విపక్ష పార్టీలు పట్టుబట్టాయి. దీంతో ఈ క్రమంలోనే సభా కార్యకలాపాలకు విఘాతం కలిగించారనే కారణం వల్ల లోక్‌సభ నుంచి విపక్ష ఎంపీలను స్పీకర్ ఓం బిర్లా బహిష్కరించారు. ఇదే సమయంలో రాజ్యసభలో కూడా ఇలాంటి అవంతరాలు జరగడంతో ఇక్కడ కూడా రాజ్యసభ ఛైర్మన్ కొంతమంది సభ్యుల్ని సస్పెండ్ చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేస్తాం

ఇది ఎన్నికలకు ముందు జరగనున్న చివరి బడ్జెట్ సమావేశాలు(Budget Meetings) కావడం వల్ల పార్లమెంట్‌లో సభ్యులందరూ ఉండాలని కేంద్రం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలోనే అందరి సస్పెన్షన్లను ఎత్తివేయనున్నట్లు తెలుస్తోంది. విపక్ష ఎంపీల సస్పెన్షన్లను ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి అన్నారు. ప్రభుత్వం తరుఫున లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ ఛైర్మన్‌లకు ఈ విషయంపై అభ్యర్థన కోరామని.. వాళ్లు కూడా ఇందుకు అంగీకరించినట్లు పేర్కొనన్నారు.

ఇదిలా ఉండగా.. లోక్‌సభ నుంచి 135 మంది, రాజ్యసభ నుంచి 11 మంది సస్పెన్షన్‌కు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు ( జనవరి 31) నుంచి ఫిబ్రవరి 9 దాకా బడ్జెట్ సెషన్ జరగనుంది. ఇక ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

Also Read: స్నేహితుడితో అసహజ శృంగారం.. నగరం నడిబొడ్డున యువకుడి దారుణ హత్య

#nirmala-sitharaman #lok-sabha-mp-suspension #national-news #parliament-budget-sessions
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి