I.N.D.I.A: ఎంపీల సస్పెన్షన్... దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు

పార్లమెంట్ నుంచి 146 మంది విపక్షాల ఎంపీలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఇండియా కూటమి ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సస్పెండ్ అయిన ఎంపీలు సేవ్‌ డెమొక్రసీ అంటూ నినాదాలు చేపట్టారు.

New Update
I.N.D.I.A: ఎంపీల సస్పెన్షన్... దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు

MP's Suspension: పార్లమెంట్ లో (Parliament) ప్రతిపక్ష పార్టీల ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడ్డ విషయం తెలిసిందే. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నిరసనలు చేపట్టనుంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ (Jantar Mantar in Delhi) దగ్గర ఇండియా కూటమి నేతలు (Indian National Developmental Inclusive Alliance) ఆందోళన చేపట్టారు. సేవ్‌ డెమొక్రసీ అంటూ ‘ఇండియా’ కూటమి ఎంపీల నినాదాలు చేస్తున్నారు. శీతాకాలం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ సమావేశాల్లో మొత్తం 146 మందిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్లమెంట్ లో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్న ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

ALSO READ: తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు!

ఇందిరాపార్క్ వద్ద సీఎం రేవంత్ ధర్నా...

పార్లమెంట్ లో ఎంపీలను సస్పెండ్ చేయడంపై తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నిరసన చేపట్టింది.హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ (Indira Park) దగ్గర సీఎం రేవంత్ రెడ్డి (CM Reavnth Reddy) నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatto Vikramarka), మంత్రులు, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ధర్నా కొనసాగనుంది. పార్లమెంట్‌లోకి చొరబడిన దుండగులు స్మోక్‌ బాంబ్స్‌ను వదిలిన విషయం తెలిసిందే. అయితే, అవి కలర్ స్మోక్స్ మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా వారు ఉగ్రవాదులు అయితే పరిస్థితి ఏంటి? అనేది అందరిలోనూ భయం కలిగించింది. అయితే, పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలపై ఇండియా కూటమి ఎంపీలు లోక్‌సభ, ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: వాహనదారులకు గుడ్ న్యూస్… చలాన్లపై మరోసారి రాయితీ!

Advertisment
Advertisment
తాజా కథనాలు