Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుపై ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు సమావేశాలకు దూరంగా ఉన్న ఆయన రెండో రోజు కూడా వచ్చే అవకాశం కనిపించట్లేదు. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

Hyderabad :అసెంబ్లీకి కేసీఆర్ రాకపై ఉత్కంఠ.. ఆటోల్లో బయలుదేరిన ఎమ్మెల్యేలు!!
New Update

Telangana Assembly:  తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం మొదలయ్యాయి. మొదటిరోజు గవర్నర్ తమిళసై సభను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. అయితే ఈ సమావేశాలను మాజీ సీఎం కేసీఆర్ హాజరు కావడంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మొదటి రోజు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న కేసీఆర్.. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా గవర్నర్‌తో, సీఎం రేవంత్ తో మంచి సంబంధాలు లేకపోవడం వల్లే బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారంటూ చర్చ నడుస్తోంది.

తీర్మానంపై చర్చ..

ఇక మొదటి రోజు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలుకానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపై తీర్మానాన్ని ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రతిపాదించనున్నారు. ఈ తీర్మానంపై చర్చ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత అన్ని పార్టీల సభ్యుల మాట్లాడిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వనున్నారు.

ఇది కూడా చదవండి : Mumbai : ఫేస్‌బుక్‌ లైవ్‌లో మర్డర్.. కార్పోరేటర్ ను కాల్చి చంపిన ఉద్యమకారుడు

ఆటోల్లో ఎమ్మెల్యేలు..

అలాగే ఆటో డ్రైవర్లకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వినూత్న నిరసన చేపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాలకు రెండో రోజు కూడా ఆటోల్లోనే రాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటిరోజు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి గన్ పార్క్ వరకు హరీష్ రావు సహా ఎమ్మెల్యేలంతా ఆటోల్లోనే హాజరయ్యారు. మరికొంతమంది బస్సుల్లోనూ ప్రయాణిస్తు వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు.. మహిళలకు ఫ్రీ బస్సు కారణంగా ఆటో డ్రైవర్లు రోడ్డున పడ్డారని, ఆటో కార్మికుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ మార్గాల్లో అసెంబ్లీకి వస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లకు ప్రత్యామ్నాయం చూపాలని డిమాండ్ చేశారు. అంతేకాదు కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఉచిత బస్సు హామీ కారణంగా చనిపోయిన ఆటో డ్రైవర్ల కుటుంబాలని రూ.10లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కోరారు.

#cm-revanth #telangana-assembly #hyderabad #kcr #governer-tamili-sai-soundararajan
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe