విచారణ వాయిదా..
విశాఖ కోడికత్తి శ్రీనివాస్ అడ్వకేట్ నాగసింధు Rtvతో మాట్లాడుతూ..ఈ కేసు విచారణ ఈనెల 20కి వాయిదా వేశారని వెల్లడించారు. నిందితుడు శ్రీనివాస్‌ని విశాఖ జైలులో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించిందని తెలిపారు. అడ్వకేట్ కమిషనర్ ముందు విచారణ చేయాలని సీఎం జగన్ కోరారు. కచ్చితంగా జగన్ కోర్టులో హాజరు కావాలని పిటిషన్ వేసాం ఆ పిటిషన్ కూడా ఈనెల 20న విచారణ జరుగుతోందని వెల్లడించారు.
కోడికత్తి కేసులో సీఎం జగన్ కు చుక్కెదురు
సీఎం జగన్ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు విశాఖ ఎయిర్‌పోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది. విశాఖలో ఎన్ఐఏ కోర్టులో ఈ విచారణ నేడు జరిగింది. తదుపరి విచారణను ఈనేల 20వ తేదీకి వాయిదా వేసింది కోర్టు. అయితే ఈ అభ్యర్థన విశాఖ సెంట్రల్ జైల్‌కు పంపాలని ఆదేశించింది కోర్టు. నిందితుడు జనపల్లి శ్రీనివాసరావు ప్రస్తుతం కోడికత్తి కేసు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. శ్రీనివాస్‌ను ప్రతీ వాయిదాకు రాజమండ్రి నుంచి విశాఖ తీసుకు వస్తున్నారు. సీఎం జగన్ ముఖ్యమైన పదవిలో ఉన్నందున విచారణలో ఆయనకు అడ్వకేట్ కమీషన్‌ను నియమించుకునే ఛాన్స్ ఇవ్వాలని కోర్టును జగన్ తరపు న్యాయవాది కోరారు. అయితే దీనిపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
మా చివరి రోజుల్లో..తల్లి ఆవేదన..
2018లో ప్రతిపక్ష నేతగా సీఎం జగన్ ఉన్న సమయంలో ఈ దాడి జరిగిన విషయం తెలిసిందే. విశాఖ ఎయిర్‌పోర్టులో ఆయనపై కోడి కత్తితో దాడి చేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారిస్తోంది. శ్రీనివాసరావు అప్పటి నుంచి జైల్లో ఉడటంతో తల్లి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎంతోమంతి హత్యలు చేసి బయటకు వస్తున్నారు. చంపేసి మూట కట్టేసి రోడ్డుమీద పడేసినోళ్లో కూడా బెయిల్ ఇచ్చారు..? తన కొడుకు ఏ తప్పు చేయపోయినా నాలుగున్నరేళ్లుగా జైల్లో ఉన్నాడని నిందితుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. మా చివరిరోజుల్లో నా బిడ్డ మా దగ్గర ఉండాలని తల్లి ఆరాట పడుతోంది.
కోర్టుకు వచ్చి స్టేట్‌మెంట్ ఇవ్వాలి
అయితే ఎన్ఐఏ కేసులో ఎలాంటి కుట్రకోణం లేదని తేల్చినా.. సీఎం జగన్ కోర్టుకు హాజరుకాకపోవడానికి కారణం ఏమిటని నిందితుడి శ్రీనివాస్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తోన్నారు. ఎన్ఐఏ విచారణలో ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని తేల్చినా.. బెయిల్ ఎందుకు ఇవ్వడంలేదు..? అని నిందితుడి తరపు లాయర్ ప్రశ్నిస్తున్నారు. గతంలో కోర్టుకు ఒక్క సారి వచ్చి జరిగిన విషయం చెప్పాలని ఆదేశించినా.. ఇంతవరకు హాజరుకాలేదు..? ఎందుకు..? ఈ కేసులో సీఎం జగన్ ఎన్‌వోసీ అయినా ఇవ్వాలి..? లేదా వచ్చి వాదనలు అయినా వినిపించాలని? వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. కోర్టుకు వచ్చి స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు బాధితుడిగా ఉన్న సీఎం జగన్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. సీఎం బాధ్యతల్లో ఉన్నానని.. కోర్టుకు వస్తే కక్షిదారులకు ఇబ్బంది అవుతుందని జగన్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.