/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/india-vs-afg-jpg.webp)
వరల్డ్‌కప్ ముగిసిన భారత్ రెండు టీ20 సిరీస్‌లు ఆడింది. వచ్చే ఏడాది(2024) టీ20 వరల్డ్‌కప్ ఉండడంతో ఇక ఎక్కువగా ఇండియా టీ20లపైనే ఫోకస్ చేయనుంది. వరల్డ్‌కప్ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాపై జరిగిన టీ20 సిరీస్‌లో భారత్ 4-1తో విజయం సాధించగా.. దక్షిణాప్రికాపై టీ20 సిరీస్‌ను డ్రా చేసుకుంది. ఇక సఫారీలపై వన్డే సిరీస్‌లను గెలుచుకుంది. ఈ నెల 26 నుంచి దక్షిణాఫ్రికా-భారత్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ఆరంభంకానుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే ఇండియా వర్సెస్ అఫ్ఘానిస్థాన్ సిరీస్ మొదలుకానుంది. ఈ సిరీస్‌కు పలువురు టీమిండియా ఆటగాళ్లు దూరం కానున్నట్టు సమాచారం.
Surya Kumar Yadav has twisted his ankle.
It's not looking good bro. pic.twitter.com/OsAFRiRnXN— R A T N I S H (@LoyalSachinFan) December 14, 2023
ఇద్దరూ అవుట్?
జనవరి 11నుంచి స్వదేశంలో భారత్ అఫ్ఘానిస్థాన్‌తో తలపడనుంది. మూడు టీ20ల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్‌కు టీ20 స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యా అందుబాటులో ఉండే అవకాశం లేదని సమాచారం. ఈ ఇద్దరూ గాయంతో బాధపడుతున్నారు. వరల్డ్‌కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌పై జరిగిన మ్యాచ్‌లో పాండ్యా గాయపడ్డాడు. అప్పటినుంచి ఇప్పటివరకు గ్రౌండ్‌లో అడుగుపెట్టలేదు. అఫ్ఘానిస్థాన్‌పై సిరీస్‌కు కూడా పాండ్యా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ లేదు. హార్దిక్ ఫిట్‌నెస్ స్టేటస్‌పై ఇప్పటి వరకు ఎలాంటి అప్‌డేట్ లేదు. ఐపీఎల్ సమయానికి కూడా అతను అందుబాటులో ఉండేది అనుమానంగానే మారింది.
అటు దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించిన సూర్యకుమార్‌యాదవ్‌కు చీలమండ గాయమైంది. దీంతో అతను కూడా అఫ్ఘాన్‌పై టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉండడం లేదు. వన్డేల్లో ఫ్లాప్ ఆటగాడైన సూర్య.. టీ20ల్లో మాత్రం టాప్ హిట్టర్. టీ20 నంబర్-1 ప్లేయర్‌గా ముద్రపడ్డ సూర్యలేకుండానే ఇండియా అఫ్ఘాన్‌పై తలపడాల్సి ఉంటుంది. గత రెండు టీ20 సిరీస్‌లకు సూర్యనే కెప్టెన్‌గా వ్యవహారించాడు. మరి సూర్య స్థానంలో ఏ ఆటగాడిని తీసుకుంటారో.. ఎవరిని కెప్టెన్‌గా నియమిస్తారో చూడాల్సి ఉంది. రుతురాజ్ గైక్వాడ్ కూడా వేలు గాయం కారణంగా సిరీస్‌కు దూరం కానున్నాడు.
Also Read: జగన్‌కు పీకే ఝలక్.. ఇక టీడీపీ కోసం వ్యూహాలు.. ఇదిగో ప్రూఫ్!
WATCH: