Surrogacy: సరోగసీపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

సరోగసి ద్వారా గర్భాశయాన్ని అద్దెకు తీసుకొని పిల్లల్ని కనడాన్ని ఇప్పటికీ కూడా నేను అవమానవీయంగానే భావిస్తానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ అన్నారు. ఈ సరోగసి విధానాన్ని అంతర్జాతీయ నేరంగా మర్చే బిల్లుకు కూడా తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.

New Update
Surrogacy: సరోగసీపై ఇటలీ ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు..

Surrogacy: ఈ మధ్యకాలంలో చాలామంది సరోగసీ ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. ఈ విధానంలో పిల్లలు కనడానికి పలు దేశాల్లో చట్టబద్ధత ఉంది. మరికొన్ని దేశాల్లో నిషేధం విధించారు. అయితే తాజాగా సరోసగిపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ పద్ధతిలో జన్మించిన పిల్లల్ని సూపర్‌ మార్కెట్‌ ఉత్పత్తులుగా పరిగణిస్తారంటూ తీవ్రంగా స్పందించారు. ' ఒకరి గర్భాన్ని అద్దెకు తీసుకొని పిల్లల్ని కనడం అనేది స్వేచ్ఛాచర్య అని మీరు నన్ను ఒప్పించలేరు.

Also Read: మేఘా కృష్ణారెడ్డికి షాక్.. సీబీఐ కేసు నమోదు

పిల్లల్ని సూపర్ మార్కెట్‌ ఉత్పత్తులుగా పరిగణించడాన్ని ప్రేమ అని మీరు నాకు సర్దిచెప్పలేరు. గర్భాశయాన్ని అద్దెకు తీసుకొని పిల్లల్ని కనడాన్ని ఇప్పటికీ కూడా నేను అవమానవీయంగానే భావిస్తానని' మెలోనీ అన్నారు. అంతేకాదు ఈ సరోగసి విధానాన్ని అంతర్జాతీయ నేరంగా మర్చే బిల్లుకు కూడా తన మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. అయితే సరోగసి ద్వారా పిల్లల్ని కనడం అనేది ఇటలీలో ఇప్పటికే చట్టవిరుద్ధం. అయినప్పటికీ ఇందుకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేసేలా ఇటలీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోది.

మరోవిషయం ఏంటంటే ఇటలీ దేశస్థులు.. చట్టబద్ధమైన దేశాల్లో కూడా సరోసగి ద్వారా పిల్లల్ని కనకుండా ఈ నిబంధనలు ఉండనున్నాయి. అయితే దీనిపై ఇటలీలో విపక్ష పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

Also Read: భార్యను హత్య చేసి పరారయ్యాడు.. నిందితుడిపై రూ.2 కోట్ల రివార్డ్‌

Advertisment
తాజా కథనాలు