Surrogacy Law: సరోగసీ నిబంధనల్లో మార్పులు..దాతల నుంచి కూడా వీర్యం, అండాలు సరోగసీ నింబధనల్లో మార్పులు చేశారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటనను విడుదల చేసింది. దాని ప్రకారం ఇక మీదట దాతల నుంచి కూడా వీర్యం, అండాలను తీసుకోవచ్చని చెప్పింది. By Manogna alamuru 23 Feb 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Surrogacy New Rules: పిల్లలు కనలేని తల్లిదండ్రులకు సరోగసీ ఒక వరం. దంపతుల కోసం వేరే మహిళ బిడ్డను కనిస్తే అది సరోగసీ అవుతంది. బిడ్డ పుట్టిన తర్వాత తల్లిదండ్రులకు అప్పగించేయాలి. కన్న మహిళకు ఇంకేమీ సంబంధం ఉండదు. లోపాల కారణంగా జన్మనివ్వలేని తల్లిదండ్రులకు ఇది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పటివరకు ఎవరైతే దంపతులు ఉంటారో వారి నుంచే వీర్యం (Sperm) సేకరించి వేరే మహిళ శరీరంలోని అండంలో ప్రవేశపెట్టేవారు. కానీ ఇప్పుడు సరోగసీ రూల్స్‌ను కొన్నింటిని మార్చింది కేంద్ర ప్రభుత్వం. కొత్త నిబంధనలు... ఇంతకు ముందు రూల్స్ (Surrogacy Rules) ప్రకారం లోపాలు ఉన్న వారు మాత్రమే సరోగసీ ఉపయోగించుకునేందుకు అర్హులు. వీర్యం, అండాలు కూడా దగ్గర బంధువులవై అయి ఉండాలి. అది కూడా మెడికల్ ఫ్రూఫ్స్ ఉండాలి. భార్య లేదా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని జిల్లా మెడికల్ బోర్డ్ ధ్రువీకరిస్తే, వివాహిత జంటలో ఒక భాగస్వామి ఎగ్, లేదా స్పెర్మ్‌ను ఉపయోగించలేని పరిస్థితి ఎదురైనప్పుడు, వారు సరోగసీ కోసం దాత ఎగ్‌ను పొందవచ్చును. కానీ ఇప్పుడు మారిన రూల్స్ ప్రకారం స్పెర్మ్ దానం చేయడానికి అంగీకరించారు. ఇప్పుడు వీర్యం, అండం రెండూ కూడా దాతల నుంచి పొందవచ్చని చెబుతోంది కేంద్రం. వైద్య కారణాల వల్ల గర్భం దాల్చలేని వ్యక్తులు, ఇతర సంతానోత్పత్తి ఆప్షన్లు లేని వృద్ధ మహిళలు దాత అండాల నుంచి ప్రయోజనం పొందవచ్చు. అలాగే స్పెర్మ్ డొనేషన్ కూడా పొందవచ్చని తెలిపింది. ఇప్పుడు స్పెర్మ్ దాతల అవసరాన్ని తగ్గించిందని, వృషణాల నుంచి నేరుగా స్పెర్మ్‌ను సంగ్రహించి అండాల్లోకి ఇంజెక్ట్ చేసే టెక్నాలజీలు ఇప్పుడు ఉన్నాయని తెలిపారు. అందుకే స్పెర్మ డొనేషన్‌ను (Sperm Donation) కూడా పొదవచ్చని చెబుతోంది. వితంతువులు, ఒంటరి మహిళలకు నో.. అయితే ఈ కొత్త రూల్స్ ఏవీ ఒంటరి, వితంతు మహిళలకు వర్తించవు అని చెబుతోంది కేంద్రం. సరోగసీ చేయించుకునే ఒంటరి మహిళలు తప్పనిసరిగా వారి సొంత అండాలు, దాత స్పెర్మ్‌నే ఉపయోగించాలి అని చెప్పింది. అయితే ఇప్పుడు ఇది కన్ఫ్యూజన్‌కు దారి తీస్తోంది. ఎందుకు ఒంటరి, వితంతు మహిళలకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు. అందరి కంటే ఇది వారికే ఎక్కువ ఉపయోగపడుతుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. ఈ మినహాయింపు మీద ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. Also Read:Lasya Nandita : వెంటాడిన వరుస ప్రమాదాలు..మూడోసారి మృత్యుఒడిలోకి #parents #india #government #surrogacy #sperm #surrogacy-law మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి