మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే

మిచౌంగ్ తుపాన్ బాధితులకు ఆదుకునేందుకు బ్రదర్స్, నటులు సూర్య-కార్తిలు ముందుకొచ్చారు. శరణార్ధుల ఆహార పంపిణీ కోసం రూ.10లక్షల ఆర్ధిక సాయం అందించారు. దీంతో నిజమైన హీరోలంటే ఇలా ఉండాలంటూ ఫ్యాన్స్ పొగిడేస్తున్నారు.

మిచౌంగ్ బాధితులకు సూర్య-కార్తిల ఆర్ధిక సాయం.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే
New Update

Surya-Karthi Financial Assistance to Michaung Victims : తమిళ స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య (Suriya), కార్తి (Karthi)లు ప్రజలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. గతంలోనూ సూర్య చాలాసార్లు తన సేవా గుణాన్ని చాటుకున్న సంగతితెలిసిందే. కాగా ఇటీవలే తన 25వ సినిమా విడుదల సందర్భంగా 25 రోజుల పాటు ప్రతిరోజూ వెయ్యిమందికి అన్నదానం చేయడానికి విరాళమిచ్చారు. అయితే తాజాగా మిచౌంగ్ తుపాను తమిళ నాడు రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించింది. ఈ తుపాను కారణంగా చెన్నై అల్లకల్లోలంగా మారింది. తమిళనాడు రాజధానిలో చెన్నైలో ఇప్పటికే 8మంది మరణించారు. తుఫాన్ కారణంగా చెన్నై దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది. తుఫాను కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, ప్రస్తుతం అక్కడ విధ్వంసకర వాతావరణం కనిపిస్తోంది. ఈ క్రమంలోనే తనవంతుగా ఆర్ధిక సాయం అందించారు.

చెన్నై వీధుల్లో మొసళ్ళు తిరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. చెన్నై (Chennai)లోని అనేక ప్రాంతాలలో చెట్లు నేల కూలగా , అనేక ప్రాంతాలలో అంధకారం అలముకుంది. అక్కడ వరద బాధితులకు సినీ సెలబ్రిటీలు తమ వంతుగా సహాయాన్ని అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న కోలీవుడ్ స్టార్ హీరోలైన సూర్య, తన తమ్ముడు కార్తీలు తమ వంతుగా సహాయం అందించడానికి ముందుకు వచ్చారు. ప్రస్తుతం తమిళనాడు భారీ వర్షాలతో అక్కడ అనేక ప్రాంతాలు వరదల్లో మునిగిపోవడంతో సూర్య బ్రదర్స్ బాధితులకు మేమున్నామని భరోసా ఇస్తున్నారు.

బాధితులకు ఆహార వసతి కల్పించడానికి సూర్య తన సోదరుడు కార్తీ ఇద్దరు 10 లక్షల రూపాయల సహాయం అందించారని చెబుతున్నారు. ఇప్పటికే సూర్య అనేక సేవా కార్యక్రమాలను చేయడంతో పాటు, అవసరమైన వారికి తగిన సమయంలో తన వంతుగా సహాయం అందిస్తూనే ఉన్నారు. ఇదిలావుంటే.. తుఫాన్ ప్రభావంతో చెన్నైలో టీ నగర్, రంగనాథన్ టన్నెల్, వడపళని మురుగన్ టెంపుల్ టెంపుల్ చెరువు, కోడంబాక్కం, నుంగంబాక్కం వంటి ప్రాంతాలలో ఇళ్ళలోకి వరదనీరు చేరుతుంది. చెన్నైలో పరిస్థితుల నేపధ్యంలో అధికార యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది. ఎన్డీఆర్ఎఫ్, మరియు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను అందిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా చెన్నై ఎయిర్ పోర్ట్ లో వరదనీరు భారీగా చేరుకుంది. దీంతో విమానాశ్రయం మూతపడగా, నేడు తిరిగి తెరుచుకుంది. అయినప్పటికీ పలు విమాన యాన సంస్థలు తమ సర్వీసులను ఇంకా పునరుద్ధరించలేదు. మొత్తంగా తమిళనాట బీభత్సం సృష్టించిన తుఫాను దెబ్బకు జనజీవనం అల్లాడిపోతుంది.

Also read :అట్టుడుకుతున్న రాజ‌స్థాన్.. కొన‌సాగుతున్న బంద్

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సూర్య ‘కంగువా’ (Kanguva)లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది.

#tamil-nadu #chennai #suriya #karthi #kanguva #michaung
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe