Supreme Court: ఏ పార్టీకి ఎన్ని విరాళాలొచ్చాయో చెప్పండి.. ఈసీకి సుప్రీం కోర్టు ఆదేశం

ఎలక్షన్స్‌లో నగదు పాత్రను తగ్గించాల్సన అవసరం ఉందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు పార్టీలకు వచ్చిన విరాళాల వివరాలను సమర్పించాలని ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది.

New Update
Supreme Court : 30 వారాల అబార్షన్‌కు అనుమతి..14ఏళ్ళ బాలిక కేసులో సుప్రీం సంచలన తీర్పు

ఎన్నికల ప్రక్రియ, ఎలక్షన్ బాండ్ల గురుంచి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల్లో డబ్బు పాత్రను గణనీయంగా తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అలాగే అధికార కేంద్రాలకు.. ఆ అధికారంతో లబ్ది పొందే వారి మధ్య జరిగే క్విడ్-ప్రో-కోను చట్టబద్ధత చేసే సాధనంగా ఎన్నికల బాండ్ల పథకం మారకూడదని తెలిపింది. అధికారకంగా రాజకీయ పార్టీలకు ముడుపులిచ్చే సాధనంగా దీన్ని వినియోగించకుండా చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎన్నికల బాండ్ల పథకానికి సంబంధించి చట్టబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై మూడోరోజు విచారించిన సాగించిన ధర్మాసనం ఈ తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు స్పష్టం చేసింది.

అలాగే ఎన్నికల బాండ్ల ద్వారా సెప్టెంబరు 30, 2023 వరకు రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించిన వివరాలను సీల్డ్‌ కవర్లో సమర్పించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అలాగే ఈ పథకంలో ఉన్న లోపాలను సరిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పింది. తమకు విరాళాలు ఇచ్చేవారెవరో సంబంధిత పార్టీలకు తెలుసునని వాదనల సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వివరించారు. మరి అలాగైతే మరి ఈ విషయాన్ని బయటపెట్టొచ్చు కదా అని మెహతాను ధర్మాసనం అడిగింది.

‘‘ఎవరికి ఎవరు విరాళాలు అందిస్తున్నారో రాజకీయ పార్టీలకు తెలుసు. ఒక్క ఓటరుకు మాత్రమే ఈ విషయం తెలియదు. మరి ఓటరుకు తెలియాల్సిన అవసరం లేదంటారా’’ అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. అలాగే ఇందులో మరికొన్ని కీలక అంశాలను ప్రస్తావించింది. ఎన్నికల ప్రక్రియలో నగదు పాత్రను తగ్గించాలని.. అధీకృత బ్యాంకింగ్‌ ఛానళ్లనే వినియోగించేలా ప్రోత్సహించాలని సూచించింది. గోప్యత కల్పిస్తే బ్యాంకు లావాదేవీలు పెరుగుతాయని పారదర్శకత పాటించాలని చెప్పింది.

Also read: 2 వేల నోట్లను పోస్టులో పంపండి…ఆర్బీఐ మరో బంపర్‌ ఆఫర్

సంస్థలిచ్చే విరాళాలపై గతంలో పరిమితులు ఉండేవని, అయితే దాన్ని ఎత్తివేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనికి తుషార్ మెహతా స్పందిస్తూ షెల్‌ కంపెనీలు సృష్టికి అవకాశం ఇవ్వకూడదనే కారణంతోనే ఆ పరిమితిని ఎత్తివేసినట్లు పేర్కొన్నారు. పిటిషనర్లలో ఒకరైన స్వచ్ఛందసంస్థ ఏడీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ తన వాదనలు వినిపించారు. కేంద్రంలోనైనా, రాష్ట్రంలోనైనా ఎన్నికల బాండ్లన్నీ అధికార పార్టీకే వెళ్తున్నాయని.. ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

Advertisment
తాజా కథనాలు