BREAKING: అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పు రిజర్వు సీఎం కేజ్రీవాల్‌కు ఈసారి కూడా ఊరట దక్కలేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 10న బెయిల్ పిటిషన్‌పై తీర్పునివ్వనుంది. అయితే ఈసారి ఆయనకు బెయిల్ వస్తుందని ఆప్ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. By B Aravind 05 Sep 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది. ఈ నెల 10న బెయిల్ పిటిషన్‌పై తీర్పునివ్వనుంది. దీంతో మరికొన్నిరోజు పాటు కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు. ఈ కేసులో జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు సాధారణ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో మరుసటి రోజే కోర్టు కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ తర్వాత జూన్ 25న బెయిల్‌పై స్టే విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జులైలో ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ అంతకుముందే సీబీఐ కేసులో కూడా అరెస్టయ్యారు. జూన్ 27 నుంచి సీబీఐ జ్యుడిషియల్ కస్టడిలో ఉంటున్నారు. Also Read: అగ్నివీర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. మోదీ ప్రభుత్వ మరో యూ టర్న్! ఇదిలాఉండగా.. లిక్కర్ విధానానికి సంబంధించి మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ఈడీ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఎన్నికల ప్రచారం కోసం జైలు నుంచి విడుదలైన ఆయన తిరిగి జూన్ 2న లొంగిపోయారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉంటున్నారు. అయితే సుప్రీంకోర్టు తీర్పును సెప్టెంబర్ 10వ తేదీకి రిజర్వు చేయడం చర్చనీయాంశమైంది. అయితే ఆరోజు ఆయనకు బెయిల్ వస్తుందా ? రాదా ? అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవల ఇదే కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు, ఆ తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేజ్రీవాల్‌కు సైతం ఈసారి కచ్చితంగా బెయిల్ వస్తుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. #telugu-news #national-news #arvind-kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి